ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా శివాలయాల్లో ప్రదోష పూజలు

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

వేలూరు : వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాల్లో ప్రదోష దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ప్రదోష పూజలను నిర్వహించారు. ముందుగా తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలోని అధికార పెద్ద నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాలచే మేళ తాళాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి కాయ కూరలు, పుష్పాలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల అధిక సంఖ్యలో చేరుకొని హరోం హర నామ స్మరణాల మద్య శివాచార్యులు వేద మంత్రాల నడుమ కర్పూర హారతులు పట్టారు. అనంతరం స్వామి వార్లును అధికార నందీ వాహణంలో ఆశీనులు చేసి మాడ వీధుల్లో మేళ తాలాల నడుమ ఊరేగించారు. అదే విధంగా వేలూరు కోట మైదానంలోని జలకంఠేశ్వరాలయంలో నంది భగవాన్‌కు శివాచార్యులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి కాయకూరలతో అలంకరించారు. అనంతరం నంది భగవాన్‌కు కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. అదే విధంగా వేలూరు, తిరువణ్ణామలై, తిరుపత్తూరు, రాణిపేట వంటి జిల్లాలోని శివాలయాల్లోని నంది భగవాన్‌కు, స్వామి వార్లుకు ప్రత్యేక పూజలు చేసి దీపారధన పూజలు చేసి ప్రార్థనలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement