విజయ్‌ సేతుపతి, వెట్రిమారన్‌ కాంబో రిపీట్‌? | - | Sakshi
Sakshi News home page

విజయ్‌ సేతుపతి, వెట్రిమారన్‌ కాంబో రిపీట్‌?

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

తమిళ సినిమా: సామాజికపరమైన సమస్యలను తెరపై ఆవిష్కరించడంలో దిట్ట దర్శకుడు వెట్రిమారన్‌. ఆడుగళం చిత్రంతో దర్శకుడిగా రంగ ప్రవేశం చేసిన ఈయన దర్శకుడు బాలు మహేంద్ర శిష్యుడు అన్నది తెలిసిందే. ఆ తర్వాత పొల్లాదవన్‌, విచారణై, వడచైన్నె , విడుదలై, విడుదలై –2 పలు వైవిధ్య భరిత కథా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈయన శింబు కథానాయకుడిగా అరసన్‌ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ది క్రియేషన్స్‌ కలైపులి ఎస్‌ ధాను నిర్మిస్తున్న ఇందులో నటుడు విజయ్‌ సేతుపతి,, ఆండ్రియా, ప్రియాంక మోహన్‌, సముద్రఖని ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాగా దర్శకుడు వెట్రిమారన్‌ మరోసారి విజయ్‌ చతుపతి కథానాయకుడు చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. గిరి కాంబినేషన్లో ఇంతకుముందు విడుదలై, విడుదలై 2 చిత్రాలు రూపొంది మంచి విజయాన్ని సాధించాయి. అదేవిధంగా తాజాగా వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న అరసన్‌ చిత్రంలో కూడా విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దీంతో వీరి కాంబినేషన్లో నాలుగవ చిత్రం తెరకెక్కనుదన్న మాట. అయితే దర్శకుడు వెట్రీ మారన్‌ ప్రస్తుతం రూపొందిస్తున్న అరసన్‌ చిత్రం తర్వాత ధనుష్‌ హీరోగా తమిళ్‌ మురుగన్‌, వడచైన్నె– 2 చిత్రాలు చేయాల్సి ఉంది. వీటిని పూర్తి చేసిన తర్వాతే విజయ్‌ సేతుపతితో చేసే చిత్రం ఉంటుందని సమాచారం. అదేవిధంగా దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement