అంతర్జాతీయ కరాటే పోటీలకు నవశక్తి ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ కరాటే పోటీలకు నవశక్తి ఎంపిక

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

● జాతీయ స్థాయి పోటీల్లో రజత పతకం కై వసం

సాక్షి, చైన్నె: చైన్నెలోని ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరుపతి జిల్లా కేంద్రానికి చెందిన ర్యాలీ నవశక్తి మరోసారి జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటింది. కర్ణాటక రాష్ట్రం మైసూరు వేదికగా నిర్వహించిన 29వ ఆల్‌ ఇండియా షిటోర్యు–డు కరాటే చాంపియన్‌షిప్‌–2006 పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలలో ఓపెన్‌ కేటగిరీ కటాస్‌ విభాగంలో నవశక్తి ప్రతిభ చాటి రజత పతకం సాధించింది. అంతేకాకుండా నవశక్తివరల్డ్‌ షిటోర్యు ఇంటర్నేషనల్‌ కరాటే సిరీస్‌–2006 పోటీలకు ఎంపికై ందని, ఈ పోటీలకు జపాన్‌ దేశంలోని యెకహమా నగరం ఆతిథ్యమిస్తోందని వెంకీ మార్షల్స్‌ అకాడమీ నిర్వాహకుడు, కరాటే కోచ్‌ వెంకటేష్‌ తెలిపారు. సోమవారం చైన్నెలో నవశక్తిని సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉద్యోగులు అభినందించారు. జపాన్‌లో కూడా ప్రతిభ చాటి దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement