పోలీసు బందోబస్తు మధ్య.. | - | Sakshi
Sakshi News home page

పోలీసు బందోబస్తు మధ్య..

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

బాలికపై లైంగిక దాడి కేసులో

నిందితుడు కోర్టుకు తరలింపు

అర్ధరాత్రి కోర్టులో హజరుపర్చిన పోలీసులు

పూందమల్లి వద్ద ఉద్రిక్తత

తిరువళ్లూరు: మూడేళ్ల బాలికపై లైగింక దాడికి పాల్పడి బాలిక మృతికి కారణమైన బిహార్‌కు చెందిన వలస కార్మికుడు బిబిన్‌ మంజీని భారీ బందోబస్తు నడుమ పూందమల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలుకా పుదపేటకు చెందిన వలస కార్మికుడి మూడేళ్ల కుమార్తైపె కామాంధుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంచలనం కలిగించింది. లైంగిక దాడి ఆనంతరం బాలికను ముళ్ల పొదల్లో పడేసిన క్రమంలో బాలిక చైన్నెలోని స్టాన్లీ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై స్థానికులు రాస్తారోకోకు దిగారు. వలస కార్మికులను తమ ప్రాంతంలో నుంచి బయటకు పంపాలని, గంజాయి తదితర మత్తు పదార్థాల విక్రయాలు రవాణాను అడ్డుకోవాలన్న డిమాండ్‌ పెరిగింది. ఆందోళన నడమ బాలికకు పోలీసుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. పరిస్థితి చేజారకుండా భారీగా పోలీసులను మోహరించారు. బాలిక కుటుంబానికి రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు పెరిగింది.

8 లక్షలు ఆర్థిఽక సాయం

కామాంధుడి చేతిలో బలైన బాలిక కుటుంబానికి ముఖ్యమంత్రి రిలీఫ్‌ పండ్‌ను నుంచి రూ. 8 లక్షలు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి కుమార్‌, కలెక్టర్‌ కవిత, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే విజయకుమార్‌ తదితరులు బాధిత కుటుంబానికి అందజేశారు. సీఎం తరపున సానుభూతిని తెలిపి కుటుంబానికి అండగా వుంటామని హమీ సైతం ఇచ్చారు.

మరణశిక్ష విధించాలని

ఆందోళన

మూడేళ్ల బాలికపై లైంగిక దాడి, గత ఏడాది అదే ప్రాంతంలోనే అత్యాచార సంఘటనలను గుర్తు చేస్తూ కొందరు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ మూడేళ్ల బాలికపై అత్యాచారానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమేనని ఆరోపించారు. తమిళనాడులో మరణశిక్షను ఎందుకు తొలగించారో అర్థఽం కావడం లేదు. తమకు సీఎం, పీఎంపై నమ్మకం లేదు. కానీ భారత న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. మూడేళ్ల బాలికపై అత్యాచారంతో పాటు రాష్ట్రంలో ఎక్కడ లైంగిక దాడి జరిగినట్టు నిర్దారణ జరిగితే వారికి తూతూ మంత్రంగా శిక్ష పడకుండా మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. ఇది ఇలా వుండగా ఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురుకాకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. వలస కార్మికులు నివాసం వున్న ప్రాంతాల్లో గంజాయి మత్తుమాత్రల విక్రయాలపై ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement