పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

వేలూరు: రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంట రుణాల మాఫీని చేయాలని కోరుతూ రైతు నాయకులు ధ్వజమెత్తారు. వేలూరు కలెక్టరేట్‌ ఆవరణలోని ఆర్డీఓ కార్యాలయంలో రైతులతో ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ జరిగింది. సమావేశానికి సబ్‌ కలెక్టర్‌ వెంకటేశం అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి వేలూరు డివిజన్‌ నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు. సమావేశంలో రైతులు మాట్లాడుతూ ఆనకట్టు ప్రాంతంలో ఆధార్‌ కార్డు కేంద్రం లేకపోవడంతో విద్యార్థులు, రైతులు, ప్రజలు వేలూరుకు రావాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఆనకట్ట ప్రాంతంలో వెంటనే ఆధార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం కాట్పాడి ప్రాంతంలో సిప్‌ కాడు ఏర్పాటు కోసం వ్యవసాయ భూములను సర్వే చేస్తున్నారని వీటివల్ల రైతుల వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిపోతోందని వాపోయా రు. ఈ సమావేశంలో వేలూరు డివిజన్‌ పరిధిలోని రైతు నాయకులు వ్యవసాయ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement