ధనుష్‌ను దృష్టిలో పెట్టుకొని రాసిన కథ ‘డార్క్‌’ | - | Sakshi
Sakshi News home page

ధనుష్‌ను దృష్టిలో పెట్టుకొని రాసిన కథ ‘డార్క్‌’

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

తమిళసినిమా: ఎంజీ స్టూడియోస్‌ ఏపీవి మారన్‌, దర్శకుడు గణేష్‌ కే. బాబు, ఫైవ్‌ స్టార్‌ క్రియేషన్స్‌ కే.సెంథిల్‌ కలిసి నిర్మించిన చిత్రం డార్క్‌. ఈ చిత్రం ద్వారా గణేష్‌ కె.బాబు శిష్యుడు కళ్యాణ్‌ కె జగన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు గణేష్‌ కె బాబు కథ అందించిన ఈ చిత్రంలో నటుడు అజయ్‌ కార్తీ, నటి అంజన నేత్రన్‌ జంటగా నటించారు. దర్శకుడు కె.భాగ్యరాజ్‌ , నట్టి నటరాజ్‌, సిబీ చక్రవర్తి, వీటీవీ గణేష్‌ , అరవింద్‌, సాహుల్‌, నరేన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి రవి శక్తి ఛాయాగ్రహణం, మను రమేశన్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సైకలాజికల్‌ త్రిల్లర్‌ కథా చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని కమలా థియేటర్లో నిర్వహించారు. దర్శకుడు పా.రంజిత్‌, కార్తీక్‌ యోగి, విగ్నేష్‌ కార్తీక్‌ , మారన్‌ కార్తికేయన్‌, నటుడు గౌతమ్‌ కార్తీక్‌, రియో, కలైయరసన్‌, నిర్మాత టీ. శివ, ఫైవ్‌ స్టార్‌ కదిరేశన్‌, కమల్‌ కన్నన్‌ ,ఫైవ్‌ స్టార్‌ కళ్యాణం మొదలగు పలువురు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొని డార్క్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించాలంటూ శుభాకాంక్షలు అందించారు. కాగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన దర్శకుడు గణేష్‌ కె బాబు మాట్లాడుతూ ఈ చిత్రానికి పనిచేసిన వా రంతా తన మిత్రులేనని పేర్కొన్నారు. ఈ చిత్ర కథ ను తాను నటుడు ధనుష్‌ను దృష్టిలో పెట్టుకొని రాశానని, అయితే నటుడు అజయ్‌ కార్తీ ఇందులో నటించడానికి ముందుకు వచ్చారని చెప్పారు. నిజం చెప్పా లంటే అదే కార్తీపై తనకు సందేహం ఉంటూనే వచ్చిందన్నారు. రోజూ షూటింగ్‌ పూర్తికాగానే చిత్రీకరించిన సన్నివేశాలను చూస్తుంటే వాడినని చెప్పారు. అలా చిత్ర క్లైమాక్స్‌ చిత్రీకరణ సమయంలో తాను లొకేషన్‌కు వెళ్లాను అన్నారు. ఒక సన్నివేశంలో అజయ్‌ కార్తీ నటించగా సంతృప్తి కలిగిన దర్శకుడు ఓకే చెప్పారు అన్నారు. అయితే అజయ్‌ కార్తీ మాత్రం మరో టేక్‌ చేద్దాం అని కోరారన్నారు. తాను షార్ట్‌ బాగానే వచ్చింది సమయం కూడా లేదు వద్దని చెప్పానన్నా రు. అయితే ఆయన మాత్రం మరో టెక్‌ చేయాలని పట్టుబట్టడంతో కోపంతో తాను పక్కకు వెళ్లి కూర్చున్నానని చెప్పారు. అయితే ఆ టేకులో అజయ్‌ కార్తీ నటించిన సన్నివేశాన్ని చూసి షాక్‌ అయ్యానన్నారు. డార్క్‌ చిత్రానికి అదే ది బెస్ట్‌ సన్నివేశమన్నారు.

కామెడీ, ప్రేమ కథా చిత్రంగా

‘లవ్‌ ఓ లవ్‌’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement