క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

తిరువణ్ణామలై ఎస్పీగా

కార్తికేయన్‌ నియామకం

వేలూరు: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56 మంది పోలీసు అధికారులను ఉన్న ఫలంగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరువణ్ణామలై ఎస్పీగా పనిచేస్తున్న డాక్టర్‌ సుధాకర్‌ను చైన్నెలోని డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. చైన్నె అడయారు అసిస్టెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎసీ కార్తికేయన్‌ను తిరువణ్ణామలై జిల్లా ఎస్పీగా నియమించారు.

ప్రత్యేక కార్యదర్శిగా వివేకానందన్‌

కొరుక్కుపేట: తమిళనాడు ప్రభుత్వ పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక శాఖ కార్యదర్శిగా వివేక నందన్‌ను నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంటూ తమిళనాడు పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వివేకానందన్‌, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహం, వాణిజ్య శాఖ కార్యదర్శి గా నియమితులయ్యారు. సేలం పంపిణీ శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న శాంతి సమీకృత శిశు అభివృద్ధి సేవల ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా, సమీకృత శిశు అభివృద్ధి సేవల ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా ఉన్న మెర్సీ రమ్య తమిళనాడు విద్యుత్‌ పంపిణీ సంస్థ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు కేటాయించినట్లు స్పష్టం చేశారు.

బాలికకు లైంగిక వేధింపులు

– నిందితుడి అరెస్టు

తిరువొత్తియూరు: ఉత్తిరమేరూర్‌ సమీపంలో బాలికకు లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రైవే టు పాఠశాల ఉపాధ్యాయుడిని పోలీసులు అరె స్టు చేశారు. వివరాలు.. ఉత్తిరమేరూర్‌ సమీపంలోని సిక్కుట్టపట్టు గ్రామానికి చెందిన జీవా (41) గతంలో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు ఓ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టగా, బాలిక తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేర కు కాంచీపురం మహిళా పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడు జీవా పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

వ్యక్తిగత ఫొటోలతో

వివాహితకు బెదిరింపులు

– వ్యక్తి అరెస్ట్‌

తిరువొత్తియూరు: ఓ యువతికి చెందిన వ్యక్తిగత ఫొటోలను రహస్యంగా తీసి, వాటిని ఆమె బంధువులకు పంపి బెదిరింపులకు పాల్పడిన ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. నైల్లె జిల్లా నాంగునేరికి చెందిన సుభాష్‌ (47)కు అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితతో సెల్‌ ఫోన్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. వీరిద్దరూ తరచూ రహస్యంగా కలుసుకునేవారని సమాచారం. ఆ సమయంలో, సదరు యువతికి తెలియకుండా సుభాష్‌ తన మొబైల్‌లో ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను చిత్రీకరించాడు. ఆ ఫొటోలను చూపి స్తూ సుభాష్‌ సదరు యువతిని బెదిరించి తర చూ డబ్బు వసూలు చేసేవాడు. ఒక దశలో యువతి డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన సుభాష్‌, ఆమె అంతరంగిక వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరిస్తూ, కొన్ని వీడియోలను ఆమె బంధువులకు పంపాడు. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆ యువతి నైల్లె జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యా దు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా మున్నీర్‌పల్లం పోలీసులు విచారణ జరిపి, సుభాష్‌పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

మార్ఫింగ్‌ ఫొటోలతో బెదిరింపులు

తిరువొత్తియూరు: తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువతి, తనతో పాటూ కళాశాలలో చదువుకున్న యువరాజ్‌ (20) అనే యువకుడిని ప్రేమించింది. ఈ క్రమంలో అతని ప్రవర్తన నచ్చక పోవడంతో వివాహానికి యువతి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన యువకుడు ఆమెతో కలిసి దిగిన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెడతానని అతను బెదిరించాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువరాజ్‌ ను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

కిలో మునగకాయలు రూ. 100

కొరుక్కుపేట: చైన్నెలో మునగకాయలు కిలో రూ. 100కు అమ్ముడవుతున్నాయి. ఆండిపట్టి ప్రాంతంలో వీస్తున్న బలమైన గాలులు , ఆణి మాసంలోని శుక్ల పక్షం శుభ సమయం కావడం వల్ల, మునగకాయల ధర రూ. 100 నుంచి రూ. 110 వరకు పెరిగింది. తిరునెల్వేలి, దిండిగల్‌ తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి మునగ కాయలను తీసుకొచ్చి రైతులు రోజూ కోయంబేడు కూరగాయల మార్కెట్‌లో అమ్ముతారు. గత కొన్ని రోజులుగా దక్షిణ జిల్లాల్లో కురుస్తున్న విస్తార వర్షాల కారణంగా ఉత్పత్తి దెబ్బతిని, మునగ సరఫరా సగానికి తగ్గిపోయింది. ఫలితంగా కిలోకు రూ. 70 చొప్పున ఉన్న మునగకాయలు ఒక్కసారిగా ఇది రూ.100కి పెరిగిందని వ్యాపారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement