తిరువళ్లూరు: రోటరీ క్లబ్ ఆఫ్ తిరువళ్లూరు బ్రెయిట్ ఆధ్వర్యంలో రూ.30 లక్షలు విలువ చేసే డయాలసిస్ యంత్రాలను ఆర్‌ఎం జైన్ సంస్థకు వితరణగా అందజేశారు. తిరువళ్లూరులో ఆర్‌ఎం జైన్ ట్రస్టీ ద్వారా తక్కువ ఖర్చుతో కిడ్ని బాధితులకు డయాలసిస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంస్థకు మూడు డయాలసిస్ మిషన్‌లను అందజేయాలని రోటరీ క్లబ్ ఆఫ్ తిరువళ్లూరు బ్రెయిట్ నిర్ణయించింది. ఇందులోభాగంగానే రూ.30లక్షలతో మూడు మిషన్‌లను వితరణగా వారికి అందజేశారు. సంఘం అధ్యక్షుడు ముఖేష్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా గవర్నర్ సురేష్, మాజీ గవర్నర్ జవహర్‌లాల్ హాజరయ్యారు. సంఘం సలహదారుడు, మాజీ అద్యక్షుడు ఆర్యశ్రీనివాసన్ ప్రారంభోపన్యాసం చేశారు. సంఘం నేతలు పళని, రఘు, గోవర్దన్, సుబ్రమణ్యం, కుమారస్వామి, అశోకన్, మహి, అరుల్ పాల్గొన్నారు.


