కొత్త ఎమ్మెల్యేల శిక్షణ తరగతులు ప్రారంభించిన సీఎం విజయ్ ఇది విజయ్ మోడల్ ప్రభుత్వం : స్పీకర్ వ్యాఖ్య శిక్షణకు దూరంగా డీఎంకే
సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభలో డీఎంకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు సభా నియమాలపై ముందస్తు అనుభవం ఉన్నప్పటికీ, ఈసారి కొత్తగా ఏర్పాటైన 17వ శాసనసభకు రికార్డు స్థాయిలో 146 మంది కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో అనేక మంది మంత్రులుగా కూడా ఉన్నారు. టీవీకేకు చెందిన వారే అత్యధికంగా కొత్త ముఖాలుగా అసెంబ్లీకి ఎన్నికై ఉన్నారు. తొలి రోజు శిక్షణ 104 మంది హాజరయ్యారు. డీఎంకే ఎమ్మెల్యేలు బహిష్కరించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే రాకేష్ , సీపీఎంకు చెందిన సౌమ్య అన్బుమణి, ఎండీఎంకేకు చెందిన సెంథిల్ సెల్వన్, రాజేంద్రన్, వీసీకే కు చెందిన వన్నియరసు, బీజేపీకి చెందిన భోజరాజన్, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు ఈ శిక్షణకు హాజరు కావడం విశేషం.
సభలో ఎలా ప్రవర్తించాలి?: స్పీకర్ మార్గదర్శకం
ఈ శిక్షణ శిబిరంలో స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ కొత్త ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తూ ప్రసంగించారు. అసెంబ్లీలో ఏ విషయాల గురించి మాట్లాడాలి, వేటి గురించి మాట్లాడకూడదు, ప్రజల దృష్టిని ఆకర్షించేలా సమస్యలను ఎలా లేవనెత్తాలి అనే అంశాలపై ఉదయం నుండి సాయంత్రం 5.30 వరకు నిపుణులతో శిక్షణ ఇచ్చారు. గతంలో స్పీకర్ కుర్చీ వద్దకు వెళ్లి నిరసన తెలపడం, సభా సమయాన్ని వృథా చేయడం వంటి ఘటనలు జరిగాయని,. అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఎమ్మెల్యేలు లైబ్రరీ కి వెళ్లి పాత సభా రికార్డులను, శాసనసభ చరిత్రను చదివి తెలుసుకోవాలని స్పీకర్ సూచించారు.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ అధికారంలోకి వచ్చిన తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం, శాసనసభకు తొలిసారి ఎన్నికై న కొత్త ఎమ్మెల్యేల కోసం వినూత్న కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది. చైన్నెలోని కలైవానార్ అరంగంలో కొత్త శాసనసభ్యుల కోసం ఏర్పాటు చేసిన రెండు రోజుల ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని సీఎం జోసెఫ్ విజయ్ జ్యోతి
ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కాగా
ఈ శిక్షణను డీఎంకే బహిష్కరించింది.
ఇది ’విజయ్ మోడల్’ ఆదర్శ ప్రభుత్వం
స్పీకర్ ప్రభాకర్ సీఎం విజయ్ పాలనను కొనియాడుతూ.. ‘ఇది ఒక ఆదర్శవంతమైన ’విజయ్ మోడల్’ ప్రభుత్వం. కుల, మత, జాతి భేదాలు లేకుండా ప్రజలందరినీ కలుసుకున్న ఆత్మీయత సీఎం విజయ్‌లో ఉందన్నారు. గత 40 రోజుల్లోనే దైవకృపతో ప్రజలకు అవసరమైన పనులను ఈ ప్రభుత్వం తక్షణమే పూర్తి చేసిందన్నారు. దేశం మొత్తం ఇప్పుడు తమిళనాడు వైపు ఆశ్చర్యంతో చూస్తున్నదన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఆధవ్ అర్జున, ఎన్. ఆనంద, కె.ఎ. సెంగోట్టయ్యనన్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


