సీఎం జోసఫ్‌ విజయ్‌కి విశాల్‌ మర్చిపోలేని బహుమతి | - | Sakshi
Sakshi News home page

సీఎం జోసఫ్‌ విజయ్‌కి విశాల్‌ మర్చిపోలేని బహుమతి

Jun 17 2026 12:22 AM | Updated on Jun 17 2026 12:22 AM

తమిళసినిమా: టీవీకే పార్టీ అధ్యక్షుడు జోసఫ్‌ విజయ్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆయన్ని కలవడానికి వరుస కడుతున్నారనే చెప్పాలి. అలా తాజాగా నటుడు విశాల్‌ సోమవారం ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి జోసఫ్‌ విజయ్‌ కు మర్చిపోలేని బహుమతిని ఇచ్చారు. అందుకు ముఖ్యమంత్రి విశాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇంతకీ నటుడు విశాల్‌ ముఖ్యమంత్రి జోసఫ్‌ విజయ్‌ కి అందించిన ఆ బహుమతి ఏమిటి? దీని గురించి మీడియా విడుదల చేసిన ప్రకటనలో విశాల్‌ తెలుపుతూ ‘‘ నేను నలకొల్పిన దేవి ట్రస్ట్‌ ద్వారా పలువురు విద్యార్థుల ఉన్నత విద్య సాయం చేస్తున్నాను. అదే విధంగా నేను నిర్వహించే కార్యక్రమాలకు అభినందించడానికి వచ్చే ప్రముఖులకు బొకేలు, పూల మాలలు వంటివి కాకుండా ఆ డబ్బును పేద విద్యార్థులకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా సోమవారం ముఖ్యమంత్రి జోసఫ్‌ విజయ్‌ ని కలినప్పుడు ఆయనకు బహుమతిగా ఆయన పేరుతో ముగ్గురు పేద విద్యార్థులకు ఉన్నత విద్య చదివిస్తానని చప్పాను. ఆ ముగ్గురు విద్యార్థుల పేరు వివరాలను కూడా తెలియజేశాను. ఈ బహుమతికి ముఖ్యమంత్రి జోసఫ్‌ విజయ్‌ ధన్యవాదాలు తెలిపారు‘‘ అని నటుడు విశాల్‌ పేర్కొన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌ను నటుడు శింబు, నటి సిమ్రాన్‌ కుటుంబం, నటుడు శ్యామ్‌ తదితర సినీ ప్రముఖులు కలిశారు. ఇటీవల నటి స్నేహ, ప్రసన్న దంపతులు కూడా తమ పిల్లలతో సహా కలిశారన్నది గమనార్హం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement