కొరుక్కుపేట: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని, జీఆర్‌టీ హోటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ నో టొబాకో డే వాకథాన్ 2026 ను ఆదివారం విజయవంతంగా నిర్వహించారు. హోటల్ అతిథులు, సిబ్బంది, కుటుంబాలు, స్థానిక సమాజ సభ్యులతో సహా దాదాపు 1,500 మంది పాల్గొని, ధూమపాన రహిత, పొగాకు రహిత భవిష్యత్తు కోసం ప్రచారం చేస్తూ ఏకతాటిపై 3 కిలోమీటర్లు నడిచారు. జిఆర్‌టి హోటల్స్ అండ్ రిసార్ట్స్ సీఈఓ విక్రమ్ కోటా మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలి ఎంపికలను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ వాకథాన్ విజయం, హానికరమైన అలవాట్ల కంటే శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలనే మా సామూహిక ప్రతిజ్ఞను ప్రతిబింబిస్తుందన్నారు. పొగాకు , ధూమపానం లేని ఆరోగ్యకరమైన భవిష్యత్తును ప్రోత్సహించాలని కోరారు.


