నాణ్యత, భద్రత, సేవే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నాణ్యత, భద్రత, సేవే లక్ష్యం

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

సాక్షి, చైన్నె : నాణ్యత, భద్రత, సేవా, విశ్వసనీయతపై అదే అంకిత భావంతో తాము ముందుకు సాగుతున్నట్టు జాన్సన్‌ లిఫ్ట్‌స్‌ డైరెక్టర్‌ యోహాన్‌ కె జాన్‌ తెలిపారు. సోమవారం చైన్నెలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 4 వేల కోట్లు టర్నోవర్‌తో దేశంలోనే అతిపెద్ద ఎలివేటర్లు, ఎస్కలేటర్ల తయారీ సంస్థ అయిన జాన్సన్‌ లిఫ్ట్‌స్‌ తోషిబా జాన్సన్‌ ఎలివేటర్స్‌(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీజేఈఐ)లో తన ఈక్విటీ వాటాను పెంచుకుని మెజారిటీ వాటాదారుగా మారినట్టు తెలిపారు. జపాన్‌కు చెందిన తోషిబా ఎలివేటర్‌ అండ్‌ బిల్డింగ్‌ సిస్టమ్స్‌ కార్పొరేషన్‌ జాయింట్‌ వెంచర్‌లో ఒక విలువైన వ్యూహాత్మక భాగస్వామిగా కొనసాగుతుందని అన్నారు. జాన్సన్‌ సంస్థ, తోషిబా మధ్య 14 ఏళ్ల సహకారంతో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇది భారత మార్కెట్‌కు ప్రపంచ స్థాయి వర్టికల్‌ మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో ఉమ్మడి నిబద్దతను మరింత బలపరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఈఐ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విల్‌ఫ్రెడ్‌ మార్టిన్‌ క్లారెన్స్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement