తిరువళ్లూరు: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేసిన డీఎంకే ప్రభుత్వాన్ని రెండవ సారి ఆదరిస్తే ప్రతి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉధయనిధిస్టాలిన్ వ్యాఖ్యానించారు. తిరువళ్లూరు నియోజకవర్గ డీఎంకే అభ్యర్థి వీజీ రాజేంద్రన్, ఆవడి అభ్యర్థి మంత్రి నాజర్, పూందమల్లి అభ్యర్థి కృష్ణస్వామికి మద్దతుగా ఉధయనిధి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉధయనిది మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల కాలంలో నిరుపేదల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్టు వివరించారు. ప్రజల ధీవెనలతో మళ్లీ అధికారంలోకి వస్తే వున్న పథకాలను కొనసాగించడంతో పాటూ మరిన్ని పఽథకాలను అమలు చేస్తామన్నారు. ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే వున్న క్రమంలో డీఎంకే కూటమి నేతలు ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి ఓట్లును సేకరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం పథకం ద్వారా రోజుకు 20 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని గుర్తు చేసిన ఆయన, 31 లక్షల మంది మహిళల ఖాతాలో ప్రతి నెలా వెయ్యి రూపాయలను జమ చేస్తున్నట్టు వివరించారు. రానున్న ఎన్నికలు తమిళనాడు జట్టుకు ఢిల్లీ జట్టు మద్య జరుగుతున్న పోరుగా ఆయన వివరించారు. బీజేపీ గెలిస్తే రాష్ట్రంలోని మైనారీటి అభద్రతభావానికి గురి కావడంతో పాటూ జాతీయ ఉపాధీ హమీ పనులు సైతం రద్దు అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
దినకరన్ ప్రచారం
గత ఎన్నికల్లో దొంగ ఓట్లుతోనే డీఎంకే గెలించిదని అందువల్లే ఎస్‌ఐఆర్ సవరణకు డీఎంకే అడ్డుపడిందని ఎఎంఎంకే అధినేత టిటివీ ధినకరన్ ఆరోపించారు. పూందమల్లి అన్నాడిఎంకే కూటమి అభ్యర్ది ఏలుమలైకు మద్దతుగా పూందమల్లి, తిరుమళిసై, సెవ్వాపేట, తామరపాక్కం తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ప్రచారం నిర్వహించారు.


