ఆధారాలు లేకుండా కేసు ఎలా? | - | Sakshi
Sakshi News home page

ఆధారాలు లేకుండా కేసు ఎలా?

Apr 9 2026 7:47 AM | Updated on Apr 9 2026 7:47 AM

● సీఎం కార్యదర్శి కేసులో హైకోర్టు ప్రశ్న ●చైన్నె నుండి ప్రత్యేక బస్సు సేవలు

న్యూస్‌రీల్‌

● సీఎం కార్యదర్శి కేసులో హైకోర్టు ప్రశ్న

సాక్షి, చైన్నె : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కార్యదర్శిగా ఉన్న ఉమానాథ్‌ ఎన్నికల నియామవళిని ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై చైన్నె హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీజేపీకి చెందిన న్యాయవాది మోహన్‌ దాస్‌ ఈ పిటిషన్‌ వేశారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ, ఉమానాథ్‌ కలెక్టర్లకు, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఎ. ధర్మాధికారి, జస్టిస్‌ జి. అరుళ్‌ మురుగన్‌ ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఒక ఐఏఎస్‌ అధికారిపై ఆరోపణలు చేసేటప్పుడు ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఎలా విచారణకు స్వీకరించగలమని ప్రశ్నించారు. పిటిషనర్‌ పేర్కొన్న ఉమానాథ్‌ను ఈ కేసులో ప్రతివాదిగా చేర్చకపోవడాన్ని కూడా న్యాయమూర్తులు తప్పుబట్టారు. పిటిషనర్‌ విజ్ఞప్తి మేరకు, ఉమానాథ్‌ను ప్రతివాదిగా చేర్చడానికి సమయం ఇస్తూ, తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.

తమిళ నూతన సంవత్సర సెలవులు

తిరువొత్తియూరు: వారాంతపు సెలవులతో పాటూ వచ్చే 14వ తేదీ తమిళ నూతన సంవత్సర సెలవు కూడా వస్తుండడంతో బయటి ఊళ్లకు ప్రయాణాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వ రవాణా సంస్థల తరపున ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. సాధారణంగా నడిపే ప్రభుత్వ బస్సులతో పాటు అదనంగా ప్రత్యేకబస్సులు నడపడానికి ప్రణాళిక రూపొందించారు. కిళాంబాక్కం నుండి తిరువణ్ణామలై, తిరుచ్చి, కుంభకోణం, మదురై, తిరునెల్వేలి, నాగర్‌కోవిల్‌, కన్యాకుమారి, తూత్తుకుడి, తదితర ప్రదేశాలకు 10 , 11వ తేదీలలో 970 ప్రత్యేకబస్సులు కోయంబేడు నుండి తిరువణ్ణామలై, నాగపట్టిణం, వేలాంకన్ని, హోసూరు, బెంగుళూరు వంటి ప్రదేశాలకు 190 బస్సులు, మాధవరం నుండి 24 బస్సులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు.

ఢిల్లీకి అన్నామలై!

సాక్షి, చైన్నె :ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై బుధవారం ఉదయాన్నే హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అధిష్టానం నుంచి వచ్చి పిలుపుతోనే ఆయన ఢిల్లీ వెళ్లినట్టు పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌, ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌తో ఆయన భేటీ అయ్యారు. తమిళనాడులో అమలు చేయాల్సిన ఎన్నికల వ్యూహాల గురించి ఈ సమావేశంలో చర్చించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో పలువురు అధికారులను బదిలీ చేయించే దిశగా ఓ జాబితాను తమ పెద్దలకు అన్నామలై ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement