వృషభ వాహనంపై కరకంఠేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

వృషభ వాహనంపై కరకంఠేశ్వరుడు

Mar 29 2026 7:15 AM | Updated on Mar 29 2026 7:15 AM

నగరి : పట్టణ పరిధిలోని కామాక్షీ సమేత కరకంఠేశ్వర ఆలయంలో నిర్వహిస్తున్న పంగుణోత్తర కల్య్యాణోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం కరకంఠేశ్వర స్వామిని నంది వాహనంపై ఊరేగించారు. గతంలో మాజీ మంత్రి ఆర్కేరోజా రూ.1.80 లక్షలు వెచ్చించి సిద్దం చేసి ఆలయానికి అందించిన వృషభ (నంది) ఆ వాహనంపై స్వామిని ఊరేగించారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో అభిషేక అర్చనలు నిర్వహించారు. ప్రత్యేక అలంకారంలో ఊరేగింపుగా వచ్చిన స్వామికి భక్తులు కొబ్బరికాయలు కొట్టి, కర్పూర హారతులు ఇచ్చి దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త సుబ్రమణ్యం ఏర్పాట్లను పర్యవేక్షించారు. రెడ్డి సంక్షేమ సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement