ముక్తికి మార్గం.. భక్తే | - | Sakshi
Sakshi News home page

ముక్తికి మార్గం.. భక్తే

Mar 24 2026 7:58 AM | Updated on Mar 24 2026 7:58 AM

కొరుక్కుపేట: ముక్తికి మార్గం భక్తి ఒక్కటేనని శ్రీనాథ్‌ దాస్‌ మహారాజ్‌ ఉద్భోందించారు. రానున్న శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటేశ్వర భక్త సమాజం, శ్రీ కష్ణ స్వీట్స్‌ సంయుక్తంగా సండే సత్‌సంఘ్‌ పేరుతో భజన భక్తి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ ప్రత్యేక భజన కార్యక్రమం చైన్నెలోని పెరంబూరులో గల పటేల్‌ రోడ్డులో ఉన్న వెంకటేశ్వర భక్త సమాజ ప్రాంగణమైన శ్రీఆనంద నిలయంశ్రీలో జరిగింది. వెంకటేశ్వర భక్త సమాజం అధ్యక్షులు తమ్మినేని బాబు అధ్యక్షతన ఏర్పాటైన ఈ కార్యక్రమంలో గోవిందపురం విఠల్‌ దాస్‌ మహారాజ్‌ కుమారుడు శ్రీనాథ్‌ దాస్‌ మహారాజ్‌ సారథ్యంలో శ్రీరామచంద్రుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పాండురంగ స్వామి నామాలను కీర్తిస్తూ భజన పాటలతో భక్తులలో ఆధ్యాత్మికతను చాటారు. అంకితభావంతో సేవలు అందించిన సమాజం నిర్వాహకులను శ్రీనాథ్‌ దాస్‌ మహారాజ్‌ అభినందించారు. భజన అనంతరం, ఆయన సభికులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ముక్తి సోపానం భక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన నొక్కి చెప్పారు. ప్రతి ఒక్కరూ పరమాత్ముని సేవకు తమను తాము పూర్తిగా అంకితం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు .అదనంగా, దైవానికి తమను తాము సమర్పించుకోవడానికి వీలైన తొమ్మిది రకాల భక్తి మార్గాల గురించి వివరించారు వెంకటేశ్వర భక్త సమాజం తరపున సమాజం అధ్యక్షులు తమ్మినేని బాబు శ్రీనాథ్‌ దాస్‌ మహారాజ్‌కు కతజ్ఞతలను తెలియజేశారు. గోవిందపురం ఆశ్రమంలో అంకితభావంతో సేవలు అందిస్తున్న శ్రీ చంద్రశేఖర్‌ దంపతులను ఘనంగా సత్కరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించిన వెంకటేశ్వర భక్త సమాజానికి చెందిన అర్చకులు వి. నాగరాజన్‌ , జి. బాలకష్ణను సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement