విడాకులనంతరం ఒకరిగా.. | - | Sakshi
Sakshi News home page

విడాకులనంతరం ఒకరిగా..

Mar 24 2026 7:58 AM | Updated on Mar 24 2026 7:58 AM

తమిళసినిమా: ఇటీవల సినీ రంగంలో మనస్పర్థలు, విడిపోవడాలు, విడాకులు పొందటాలు అధికం అవుతున్నాయనే చెప్పాలి. సెలబ్రిటీలు విడాకు లు పొందడం అన్నది కొత్తేమీ కాదు. అయితే కొందరు మరో పెళ్లి చేసుకుంటారు. కొందరు ఒంటరిగానే జీవిస్తుంటారు. అలా నే ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌, నటి లిజీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1990లో వీరి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు కొడు కు,కూతురు ఉన్నారు. కూతురు కల్యాణి ప్రియదర్శన్‌ నటిగా తెరంగేట్రం చేసి ఇప్పుడు ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నా రు. కాగా పెళ్లి అయిన 26 ఏళ్ల తరువాత దర్శకుడు ప్రియదర్శన్‌, నటి లిజీ మనస్పర్ధల కారణంగా గత 2016లో విడిపోయారు. వీరిద్దరూ పరస్పరం చర్చించుకునే విడిపోయి విడాకులు పొందారు. అయితే ఆ తరువాత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం జరగలేదు. ఆస్తుల పంపకం కూడా ఎలాంటి వివాదాలు లేకుండా జరిగిపోయాయి. అయితే చాలా మందిలా దర్శకుడు ప్రియదర్శన్‌, నటి లిజీ రెండో వివాహం చేసుకోలేదు. అదే విధంగా వారి పిల్లలు కొడుకు సిద్ధార్ధ్‌, కూతురు కల్యాణి ప్రియర్శన్‌ తల్లిదండులిద్దరిని ప్రేమిస్తారు,గౌరవిస్తారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. విడాకులు పొందిన దశాబ్దం తరువాత ఈ సంచలన జంట మళ్లీ కలిసి జీవించడం విశేషం. కొడుకు సిద్ధార్ధ్‌ పెళ్లి ఇద్దరి చేతుల మీదగా జరిపారు. ఇతర కార్యక్రమాల్లోనూ ప్రియదర్శన్‌, లిజీ కలిసి పాల్గొనడం వెలుగులోకి వచ్చింది. ఇటీవల నటుడు మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన పెట్టియాట్‌ చిత్ర డబ్బింగ్‌ కార్యక్రమాలు చైన్నెలోని నటి లిజీ డబ్బింగ్‌ స్టూడియోలో జరిగాయి. ఈ సందర్భంగా దర్శకుడు ప్రియదర్శన్‌, నటి లిజీ కలి సి జీవిస్తున్నారని తెలిసిన మమ్ముట్టి వారిద్దరిని డబ్బింగ్‌ థియేటర్‌కు రప్పించి ఫొటోలు దిగి అభినందించారు. ఆ ఫొటోలను నటి లిజీ తన డబ్బింగ్‌ థియేటర్‌లో పొందుపరిచారు. కాగా పెళ్లి అయిన 26 ఏళ్లకు విడిపోవడం, ఆ తరువాత మరో పదేళ్ల తరువాత మళ్లి కలిసి జీవించడం అన్నది అరుదైన విషయమే అవుతుంది. అలాంటి అరుదై జంట మళ్లీ పెళ్లి చేసుకోకపోయినా, కలిసి సహజీవనం చేయాలని భావిస్తున్నట్లు తాజా సమాచారం.

దర్శకుడు ప్రియదర్శన్‌,

నటి లిజీ

ఊహించని

షాక్‌ ఇచ్చిన అజిత్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement