తమిళసినిమా: నటుడు సూర్య కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కరుప్పు. ఇది పలు ప్రత్యేకతలతో కూడిన చిత్రం. ఇందులో నటుడు సూర్యకు జంటగా నటి త్రిష నటించారు. నటుడు ఆర్జే .బాలాజీ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. డ్రీమ్‌వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి సాయ్ అభయంకర్ సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా నటుడు సూర్య రెండు గెటప్స్‌లో నటించారు. ఆయన ద్విపాత్రా భినయం చేశారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. మొత్తం మీద ఈ చిత్రం మే నెల 16వ తేదీన తెరపైకి రానుంది. దీంతో నటుడు సూర్య అభిమానులు చా లా ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. కాగా ఈ చిత్ర కథను నటుడు విజయ్ కోసం రాశానని, ఆయనకు చాలా నచ్చిందని దర్శకుడు ఆర్జే బాలాజీ ఇటీవల ఒక భేటీలో పేర్కొన్నారు. ఆయన ఏమన్నారంటే.. తొలుత మూక్కుత్తి అమ్మన్ –2 కథను విజయ్‌కు వినిపించినట్లు, ఆ తరువాత అదే కథతో సూర్య హీరోగా రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి నేను విజయ్‌కి వేరే కథ చెప్పారు. అదీ ఆయనకు చాలా బాగా వచ్చింది. అయితే దాన్ని తెరకెక్కించానికి 16 నెలలు సమయం పడుతుంది. దీంతో ఇది వర్కౌట్ కాదని నాకే అనిపించింది. దీంతో మరో కథను విజయ్‌కి వినిపించాను. అదీ ఆయనకు బాగా నచ్చింది. అలాంటి సమయంలో ఆయన రాజకీయ రంగప్రవేశానికి సిద్ధం అయ్యారు. దీంతో అదే కథను సూర్యకు వినిపించాను. ఆయన నటించడానికి సమ్మతించడంతో కథలో కొన్ని మార్పులు చేశాను. అలాగే ఈ చిత్రానికి ఏఆర్.రెహ్మాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశాం. అయితే అనివార్య కారణాల వల్ల ఆయన చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో ఆ స్థాయి సంగీత దర్శకుడిని ఎంపిక చేస్తారని అందురూ అనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో నేను వర్గమాన సంగీతదర్శకుడు సాయ్ అభయంకర్ పేరును నిర్మాతల దృష్టికి తీసుకెళ్లాను. మొదట వారు ఆశ్యర్యపోయి నా, తరువాత ఓకే చెప్పా రు. నేను కూడా అంతకు ముందు సాయ్ అభయంకర్‌ను చూ డలేదు. అయితే ఆయనలోని తపనను గుర్తించాను. అందుకే ఆయన్ని ఎంపిక చేశాను. చి త్రం చూసిన తరువాత ఆయన వర్క్ మీకు తెలుస్తుంది అని పేర్కొన్నారు.


