సాక్షి,చైన్నె: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం అడోబ్ తన భారతీయ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తూ, క్రియేటివ్ ప్రొడక్ట్స్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్‌గా షామిక్ బసును నియమించింది ఈ మేరకు సోమ వారం స్థానికంగా ప్రకటించారు. అడోబ్ ఇండియా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ బృందాలకు ఆయన నాయకత్వం వహిస్తారని తెలిపారు. షామిక్ బసు క్రియేటివ్ ప్రొడక్ట్స్ గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఎలీ గ్రీన్ ఫీల్డ్‌కు తన నివేదికలను సమర్పిస్తారని పేర్కొన్నారు. అడోబ్ ఫైర్‌ఫ్లై, ఫొటోషాప్, ఇలస్ట్రేటర్, లైట్ రూమ్, ప్రీమియర్ వంటి ప్రపంచ స్థాయి ఉత్పత్తుల అభివృద్ధిలో గ్లోబల్ టీమ్స్‌తో కలిసి ఆయన పనిచేయనున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న షామిక్, గతంలో మైక్రోసాఫ్ట్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. అక్కడ వందల కోట్ల మంది వినియోగదారుల కోసం ఏఐ ఆధారిత ఫీచర్ల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు.


