క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Mar 22 2026 1:56 AM | Updated on Mar 22 2026 1:56 AM

పెరిగిన నిమ్మకాయల ధరలు ● కిలో రూ.180కు విక్రయం ఆంధ్ర దంపతులకు రూ. 1.80 లక్షల నగదు అప్పగింత సీవీ.షణ్ముగానికి గడ్డు పరిస్థితులు విజిల్‌ గుర్తుతో తెచ్చిన 500 వాటర్‌ బాటిళ్లు సీజ్‌ పురాతన నటరాజ విగ్రహం లభ్యం

కొరుక్కుపేట: మండుతున్న ఎండల కారణంగా నిమ్మకాయలు ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కిలో కాయలు రూ.180కి అమ్ముడవుతుంది. వేసవి ప్రారంభం కావటంతో తమిళనాడులో వడగాలులు తీవ్రమవుతున్నాయి. దీంతో ప్రజలు నీళ్లు తాగడమే కాకుండా తమ దాహాన్ని తీర్చుకోవడానికి నిమ్మ, పుచ్చకాయ వంటి పండ్ల రసాలను ఎక్కువగా తాగుతున్నారు. డిమాండ్‌ పెరగడంతో నిమ్మ ధరలు అనూహ్యంగా పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.

తిరువళ్లూరు: చైన్నెలోని వైద్యశాలకు చికిత్స కోసం వెళ్తున్న ఆంధ్ర దంపతుల నుంచి స్వాధీనం చేసుకున్న రూ.1.80 లక్షల నగదును విచారణ అనంతరం ఆంధ్ర దంపతులకు అప్పగించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తరువాత వాహనాల తనిఖీలను అధికారులు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తిరువళ్లూరు నియోజకవర్గానికి చెందిన స్పెషల్‌ టీమ్‌ శనివారం ఆంధ్ర రిజిస్ట్రేషన్‌తో కూడిన వాహనంలోని రూ. 1.80 లక్షలు స్వాధీనం చేసుకుని తిరువళ్లూరు తాలుకా కార్యాలయానికి తరలించారు. అనంతరం తిరువళ్లూరు రిటర్నింగ్‌ అధికారి రవిచంద్రన్‌ వారి వద్ద విచారణ చేపట్టారు. తిరుపతి సమీపంలోని పేరూర్‌ రాములవారి గుడి వీధికి చెందిన వినోద్‌కుమార్‌ (38), శ్రీజ(32) చైన్నె అమింజికరైలోని ప్రవేటు సీఎఫ్‌సీ వైద్యశాలకు చిక్సిత నిమిత్తం వెళ్తున్నట్లు నిర్ధారించి వారికి తిరిగి అప్పగించారు.

తమిళసినిమా: ఏ విషయంలోనైనా ఆచి తూచి మాట్లాడాలంటారు. అలా కాకుంటే తీవ్ర పరిణామాలనే ఎదుర్కొవలసి ఉంటుంది. అన్నాడీఎంకే నాయకుడు సీవి.షణ్ముగం పరిస్థితి ప్రస్తుతం ఇదే. గత ఏన్నికల్లో విళ్లుపురం నియోజక వర్గంలో పొటీ చేసి పరాజయాన్ని చవిచూసిన ఈయనకు అన్నాడీఎంకే పార్టీ రాజ్యసభ సీటు ఇచ్చి ఎంపీని చేసింది. కాగా రానున్న ఎన్నికల్లో అదే నియోజక వర్గంలో పోటీ చేయడానికి బదులు.. ఈసారి మయిలం నిరయోజకవర్గంలో పోటీ చేయడానికి అధిష్టానం టిక్కెట్‌ ఇచ్చింది. కాగా ఇటీవల సీవీ.షణ్ముగం ప్రచార కార్యక్రమంలో డీఎంకే పార్టీని వివర్శించే విధంగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా డీఎంకే పార్టీ పథకాలను విమర్శించే విధంగా తనకు నటి నయనతార అంటే ఇష్టం అన్‌, ముఖ్యమంత్రి ఆమెన తనకు ఇచ్చి పెళ్లి చేస్తారా? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి తీవ్ర వ్యతిరేక వచ్చింది. తాజాగా ఈయన పోటీ చేయనున్న మయిలం నియోజక వర్గం మహిళలు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. ఆ నియోజక వర్గంలో మహిళా ఓట్లే అధికం. కాగా ఇప్పుడు సీవీ.షణ్ముగం ఆ నియోజిక వర్గానికి ప్రచారానికి వెళ్తే ఆయన్ని అడ్డుకోవాలని మహిళామణులు భావిస్తున్నారట. అంతే కాదు, ఆ సెగ్మెట్‌లో ఒక్క నియోజిక వర్గాన్ని కూడా అన్నాడీఎంకే పార్టీ గెలకుండా చేస్తామని శపథం పడుతున్నట్లు సమాచారం.

తిరువొత్తియూరు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ఏప్రిల్‌ 23న జరగనుంది. దీనికి ముందు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లకు డబ్బు, బహుమతులు పంపిణీ చేయకుండా నిరోధించడానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, స్టాటిక్‌ నిఘా బృందాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సేలం సూరమంగళం ప్రాంతంలో ప్రార్థనలకు వచ్చే ముస్లింలకు పంపిణీ చేయడానికి, టీవీకే తరఫున విజిల్‌ గుర్తుతో కూడిన వాటర్‌ బాటిళ్లు తీసుకువచ్చినట్లు సమాచారం అందింది. దీంతో సేలం వెస్ట్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఆఫీసర్‌ మణికంఠన్‌ నేతృత్వంలోని బృందం ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. అప్పుడు ఆజాద్‌ నగర్‌లోని మసీదు ముందు 500కు పైగా వాటర్‌ బాటిళ్లు విజిల్‌ గుర్తుతో ఉండడంతో వాటిని సీజ్‌ చేసింది.

అన్నానగర్‌: నాగపట్టణం జిల్లా, వేదారణ్యం తాలూకాలోని పుష్పవనం సహకార రుణ సంఘం కోసం శుక్రవారం కొత్త భవనం నిర్మించడానికి కూలీలు గుంత తవ్వుతుండగా అడుగు ఎత్తు, 4 కిలోల 800 గ్రాముల బరువున్న ఆ విగ్రహాన్ని వెలికితీశారు. అనంతరం దానిని తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకువెళ్లారు. పురావస్తు శాఖ అధికారులు పరిశీలించిన తర్వాత పురాతన నటరాజ విగ్రహం అని అధికారులు తేల్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement