సాక్షి, చైన్నె: భారతీయ శాసీ్త్రయ సంగీత రంగంలో యువ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో హెచ్‌సీఎల్ కాన్సర్ట్స్ , రాప్సోడీ మ్యూజిక్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో నిర్వహించిన శ్రీకర్నాటిక్ క్వెస్ట్‌శ్రీ ఐదవ ఎడిషన్ విజేతలను శనివారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 145 నగరాల నుండి సుమారు 2500 మంది కళాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. గాత్రం, వీణ, వయోలిన్, వేణువు , మృదంగం, పర్కషన్ విభాగాలో విజేతలను ఎంపికచేసి బహుమతులు, అవార్డులతో సత్కరించారు. ఈ ఏడాది 18 నుండి 30 ఏళ్ల లోపు కళాకారుల కోసం ఈ పోటీని నిర్వహించారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి ట్రోఫీ, సర్టిఫికేట్ , నగదు బహుమతి అందించారు. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారికి సర్టిఫికెట్లు, నగదు బహుమతులు లభించాయి. వీరికి హెచ్‌సీఎల్ కాన్సర్ట్స్ వేదికలపై ప్రదర్శన ఇచ్చే అవకాశం కూడా కల్పించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సిక్కిల్ గురుచరణ్ (గాత్రం), లాల్గుడి విజయలక్ష్మి (వయోలిన్), కె.వి. ప్రసాద్(పర్కషన్) , శశాంక్ సుబ్రమణ్యం (వేణువు) . జయంతి కుమారేష్ (వీణ) వంటి ప్రముఖ సంగీత విద్వాంసులు వ్యవహరించిన, విజేతలను ఎంపిక చేశారు.
విజేతల జాబితా..
గాత్రం –హరి కిషన్ ప్రకాష్, వేణువు– శ్రీనిధి శిరూరు, వయోలిన్– అరవింద్ హెచ్ ,వీణ –వినాయక్ వైద్యనాథన్, పర్కషన్–అభిజిత్ అరుణ్‌లు విజేతలుగా ప్రఽథమ స్థానం చేజిక్కించుకున్నారు. హెచ్‌సీఎల్ గ్రూప్ మార్కెటింగ్ అసోసియేట్ జనరల్ మేనేజర్ నిఖిల్ సోని మాట్లాడుతూ ‘కర్నాటిక్ క్వెస్ట్’ కేవలం ఒక పోటీ మాత్రమే కాదు, ఇది యువ కళాకారుల కోసం ఒక వేదికను నిర్మిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రాంతీయ ప్రభావాలను ఈ వేదికపై చూడటం సంతోషంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న సంగీత విద్వాంసులకు తోడ్పాటు అందించడమే తమ లక్ష్యంగా పేర్కొన్నారు.


