ప్రేక్షకులను నమ్మే చిత్రాలు చేస్తున్నాం! | - | Sakshi
Sakshi News home page

ప్రేక్షకులను నమ్మే చిత్రాలు చేస్తున్నాం!

Mar 22 2026 1:56 AM | Updated on Mar 22 2026 1:56 AM

తమిళసినిమా: నటుడు భరత్‌ 2019లో నటించిన కాళిదాస్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అందులో భరత్‌ పోలీస్‌ అధికారిగా నటించారు. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం కాళిదాస్‌ 2. స్కైపిక్చర్స్‌ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ ఫైవ్‌స్టార్‌ సెంథిల్‌ నిర్మాతగా మారి డా.ఎన్‌.యోగేశ్వరన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి భాగాన్ని తెరకెక్కించిన శ్రీసెంథిల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భరత్‌, అజయ్‌ కార్తీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో భవానీశ్రీ, అపర్ణ హీరోయిన్లుగా, నటి సంగీత చాలా కాలం తరువాత కీలక పాత్రను పోషించడం విశేషం. శ్యామ్‌.సీఎస్‌ సంగీతాన్ని, సురేశ్‌ బాల చాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 10న తెరపైకి రానుంది. శుక్రవారం చెన్నలోని ఒక నక్షత్ర హోటల్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు అతిధులుగా పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు శ్రీ సెంథిల్‌ మాట్లాడుతూ నిర్మాత సెంథిల్‌ ప్రణాళిక ప్రకారం ఈ చిత్రాన్ని నిర్మించారన్నారు. నిర్మాత కలైపులి ఎస్‌.థాను మాట్లాడుతూ కొత్త నిర్మాతలు ప్రముఖుల సలహాలు, సూచనలు తీసుకుంటేమంచిదని అన్నారు. పా.రంజిత్‌ మాట్లాడుతూ సమీపకాలంలో ఈ చిత్ర నిర్మాతలు తనకు స్నేహితులు అయ్యారన్నారు. తాను ఈ చిత్రాన్ని చూశానని, అందరూ చాలా బాగా నటించారని అన్నారు. ఇది ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం అని పేర్కొన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

సినీ ప్రముఖులతో కాళిదాస్‌ 2 యూనిట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement