యుద్ధాప్రభావాన్ని వివరించే నిలీరా | - | Sakshi
Sakshi News home page

యుద్ధాప్రభావాన్ని వివరించే నిలీరా

Mar 22 2026 1:56 AM | Updated on Mar 22 2026 1:56 AM

తమిళసినిమా: స్టోన్‌బెంచ్‌ స్టూడియో పతాకంపై దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్‌, కార్తీకయన్‌ సంతానం కలిసి నిర్మించిన తాజా చిత్రం నిలీరా. దీనికి నటుడు రానా దంగుబాటికి చెందిన స్పిరిట్‌ స్టూడియో భాగస్వామ్యం పంచుకుంది. నటుడు నవీన్‌చంద్ర, సైనంద్‌, రూపా కొడువాలూర్‌,కపిలా వేణు, కయల్‌ విన్సెంట్‌,విదు, రోహిత్‌ కొకాడే, నవయుగ, సిద్ధూ కుమరేశన్‌, స్వాతి కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నవ దర్శకుడు సోమీనాధన్‌ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. చిత్ర దర్శకుడు సోమినాధన్‌ మాట్లాడుతూ తన చిన్న వయసులో శ్రీలంకలో యుద్ధం జరుగుతున్నప్పుడు తమిళ సినిమాలు విడుదలయ్యూవన్నారు. అవి చూసి తమ ఇంటిలో , తమ పరిసర ప్రాంతాల్లో జరిగే సంఘటనలను వెండితెరపై చూడలేమా ? అని అనుకునేవాడినన్నారు. అలాంటి అవకాఽశమే ఈ చిత్రం అన్నారు. యుద్ధాలు జరుగుతుండటమే మనం చూస్తుంటామని, వాటి వల్ల సాధారణ ప్రజల సమస్యలు, మరణాలు, వారి మనోభావాలు ఎలా ఉంటాయని చెప్పే చిత్రం నిలీరా అని చెప్పారు. శ్రీలంక ప్రజల ఇతి వృత్తం గురించి దివంగత ప్రముఖ దర్శకుడు బాలుమహేంద్ర నుంచి పలువురు భావించిన తొలి ప్రయత్నమే ఈ చిత్రం అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. నటుడు నవీన్‌ చంద్ర మాట్లాడుతూ తాను ఇంతకు ముందు వివిధ రకాల పాత్రల్లో నటించాననీ, అయితే నిలీరా చిత్రం తనకు చాలా ప్రత్యేకం అని పేర్కొన్నారు. దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ మాట్లాడుతూ దర్శకుడు కావాలనే తాను రంగప్రవేశం చేశానని, ఆ తరువాత విభిన్న కథా చిత్రాలను నిర్మించే విధంగా స్టోన్‌ బెంచ్‌ స్టూడియోను ప్రారంభించినట్లు చెప్పారు. అలా ఇప్పటి వరకూ పలు చిత్రాలను నిర్మించామని,ఆ చిత్రాలకు తాను సమర్పకుడిగానే పేరు వేసుకున్నట్లు , కార్తీకేయన్‌ సంతానం నిర్మాతగా పేరు ఉంటుందన్నారు.అయితే ఫస్ట్‌ టైమ్‌ ఈ చిత్రానికి తన పేరుని నిర్మాతగా పేరు వేసుకోవాలని అడిగి మరీ వేసుకున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement