చాలా విషయాలు తెలుసుకున్నా.. | - | Sakshi
Sakshi News home page

చాలా విషయాలు తెలుసుకున్నా..

Mar 22 2026 1:56 AM | Updated on Mar 22 2026 1:56 AM

తమిళసినిమా: దక్షణాదిలోనే కాదు, ఇండియన్‌ సినిమాలోనే నటి నయనతారది ప్రత్యేక జీవితం అని చెప్పక తప్పదు. కేరళ రాష్ట్రంలోని మారు మూల గ్రామానికి చెందిన ఈ మలయాళీ కుట్టి తనను నటిగా మలచుకోవడానికి చాలానే శ్రమించారు. పలు అవమానాలను, అవరాధాలను ఎదుర్కొని అగ్ర కథానాయకి స్థాయికి చేరుకున్నారు. కోలీవుడ్‌లో హరి దర్శకత్వంలో శరత్‌కుమార్‌ హీరోగా నటించిన అయ్యా చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత రజనీకాంత్‌ హీరోగా నటించిన చంద్రముఖ చిత్రంలో నటించి దక్షణాది వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అలా వరుసగా విజయాలను అందుకుంటూ అందాల ప్రదర్శనలతోనూ, అభినయంతోనూ అందరినీ మెప్పిస్తూ, ఉమెన్స్‌ సెంట్రిక్‌ కథాపాత్రల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు. నటుడు శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం బెడిసి కొట్టడంతో సింగిల్‌గానే జీవితాన్ని గడపాల్సిందే అని అనుకుంటున్న సమయంలో నానురౌడీదాన్‌ చిత్ర షూటింగ్‌లో ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ప్రేమలో పడ్డారు. కొంతకాలం సహజీవనం తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి చైన్నెలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఆ వెంటనే ఈ దంపతులు సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయంలోనూ పలు సమస్యలను ఎదుర్కొని సురక్షితంగా బయటపడ్డారు. అగ్ర కథానాయకిగా రాణిస్తున్న తరుణంలోనూ ప్రత్యేక పాటల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి నయతార గుర్తు చేసుకుంటూ విజయ్‌ హీరోగా నటించిన శివకాశీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించే అవకాశం రావడంతో తాను అందుకు సమ్మతించానన్నారు. అయితే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ పలవురు తనను ప్రశ్నించారన్నారు. ఇకపై అందరూ అలాంటి పాటల్లోనే నటించమని అడుగుతారని భయపెట్టారన్నారు. అయితే స్పెషల్‌ పాట అయితే స్పెషలేగా అని, ఏదో ఒక ఇమేజ్‌ ఉంటేనే తనకు స్పెషల్‌ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చిందని దాని ద్వారా పలు విషయాలు నేర్చుకోవచ్చుని భావించానన్నారు.అలా తాను నటించిన రెండు స్పెషల్‌ సాంగ్స్‌తో చాలా విషయాలు నేర్చుకోగలిగానని తెలిపారు. నయనతార.

నటి

నయనతార

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement