తమిళసినిమా: సీనియర్ డాన్స్‌మాస్టర్ సుందరం వారసుడిగా తెరంగేట్రం చేసిన నటుడు ప్రభుదేవా. ఈయన ముందుగా అసిస్టెంట్ నృత్య దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి కాదలన్ చిత్రంలో చికు బుకు చికు బుకు రైలే అరే స్పెషల్ సాంగ్ ద్వారా నటుడిగా తెరపై మెరిసి ఆ తరువాత కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటిస్తూనే, దర్శకుడిగానే మెగాఫోన్ పట్టి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం నటనపైనే దృష్టి సారిస్తున్న ప్రభుదేవా వారసుడు రిషీ దేవా ఇప్పుడు తెరంగేట్రం చేశారు. ఈయన ముందుగా ఒక మ్యూజికల్ వీడియో ఆల్బమ్‌లో నటించారు. ముదల్ ముదలాయ్ అనే పల్లవితో సాగే ఈ మ్యూజికల్ ఆల్బమ్‌ను సంగీత దర్శకుడు రవిచంద్రన్ శ్రీనివాస్ రాసి, సంగీతాన్ని అందించడం విశేషం. కాగా ఈ పాటను మరో ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ పాడారు. రిషీదేవా, నటి కై రా కలిసి డాన్స్ చేశారు.ప్రేమ, అయాకత్వం కలిసి, మరచిపోలేని తరుణాలను ఆవిష్కరించే వీడియోగా ఇది ఉంటుదని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నిర్వాహకులు పేర్కొన్నారు. దీనికి ట్రస్టినా ఐసక్ దర్శకత్వం వహించారు. ఆర్‌పీ గురుదేవ్ ఛాయాగ్రహణం అందించిన దీన్ని సరిగమ మ్యూజిక్ సంస్థ విడుదల చేసింది. ఈ వీడియో ఆట్బమ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
రిషీదేవాతో నటి కై రా


