● నమ్మకంతో మరోసారి దీవించండి ● ద్రావిడ మోడల్‌తో ప్రజల జీవితాల్లో మార్పు ● శివగంగలో సీఎం స్టాలిన్‌ ● రూ. 2560 కోట్లతో ప్రగతిపనులు | - | Sakshi
Sakshi News home page

● నమ్మకంతో మరోసారి దీవించండి ● ద్రావిడ మోడల్‌తో ప్రజల జీవితాల్లో మార్పు ● శివగంగలో సీఎం స్టాలిన్‌ ● రూ. 2560 కోట్లతో ప్రగతిపనులు

Feb 1 2026 3:25 AM | Updated on Feb 1 2026 3:25 AM

● నమ్

● నమ్మకంతో మరోసారి దీవించండి ● ద్రావిడ మోడల్‌తో ప్రజల జ

● నమ్మకంతో మరోసారి దీవించండి ● ద్రావిడ మోడల్‌తో ప్రజల జీవితాల్లో మార్పు ● శివగంగలో సీఎం స్టాలిన్‌ ● రూ. 2560 కోట్లతో ప్రగతిపనులు

సాక్షి, చైన్నె: సీఎం ఎంకే స్టాలిన్‌ శుక్రవారం సాయంత్రం నుంచి శివగంగ జిల్లాలో పర్యటిస్తూ వచ్చారు. రెండవ రోజు శనివారం శివగంగలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చెట్టినాడ్‌లోని వ్యవసాయ కళాశాల, పరిశోధనా కేంద్రంలో రూ.61.79 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన భవనాలు, ఆడిటోరియాన్ని ఆయన ప్రారంభించారు. ఈ ఆడిటోరియంకు భారతరత్న సి. సుబ్రమణ్యం మల్టీపర్పస్‌ హాల్‌ అని నామకరణం చేశారు. అలాగే 330 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వ్యవసాయ కళాశాలలో మరిన్ని కొత్త మౌలిక సదుపాయాల కల్పన దిశగా పరిపాలనా భవనం, ఆధునిక తరగతి గదులు, 12 విభాగాలకు ప్రయోగశాలలు, విద్యార్థుల హాస్టళ్లు, క్యాంటీన్‌, వైద్య కేంద్రం, లైబ్రరీ, ఇంటర్నెట్‌ సెంటర్‌తో పాటూ 1,500 మంది కూర్చునే సామర్థ్యం కలిగిన బహుళార్థసాధక ఆడిటోరియంను ఏర్పాటు చేశారు. ఈ కళాశాల వర్షాధార వ్యవసాయం, సిరు ధాన్యాలు, పప్పుధాన్యాలు, తక్కువ నీటి వినియోగ పంటల అభివృద్ధి, వ్యవసాయ యాంత్రీకరణ, యువతకు నైపుణ్యాభి వృద్ధి శిక్షణ వంటి రంగాలపై ప్రత్యేక దష్టి సారించే విధంగా చర్యలు తీసుకున్నారు. చెట్టినాడు–1 అనే అధిక దిగుబడి వేరుశనగ రకాన్ని అభివద్ధి చేయడంతో పాటు ఇప్పటివరకు 3,930 మంది రైతులకు శిక్షణ అందించడం విశేషం. చెట్టినాడ్‌ వ్యవసాయ కళాశాల నూతన భవనాలు ప్రారంభించినానంతరం అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. ఆ తర్వాత కారైకుడిలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ రూ.2,559.50 కోట్ల వ్యయంతో పూర్తయిన 49 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే రూ.13.36 కోట్ల విలువైన 28 కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వివిధ శాఖల ద్వారా రూ.205.6 కోట్ల విలువైన సంక్షేమ సహాయాన్ని 15,453 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఇందులో ప్రభుత్వ న్యాయ కళాశాల కొత్త క్యాంపస్‌, రహదారులు, వంతెనలు, తాగునీటి పథకాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి అనేక కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, కేకెఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌,తంగం తెన్నరసు, రఘుపతి, పెరియకరుప్పన్‌, రాజకన్నప్పన్‌, శివ మెయ్యనాథన్‌,ఎంపీలు పి చిదంబరం, కార్తీ పి చిదంబరం, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎ. తమిళరసి, శివగంగ జిల్లా కలెక్టర్‌ దక్షిణామూర్తి తదితరులు హాజరయ్యారు.

ప్రజల జీవితాలలో మార్పు..

ఈ కార్యక్రమంలో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, ద్రావిడ మోడల్‌ పాలన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతోందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చరిత్రాత్మక శివగంగకు గౌరవం తీసుకొచ్చే విధంగా ముందుకు సాగామన్నారు. శివగంగ జిల్లా ధైర్యం, త్యాగాలకు ప్రతీకగా నిలిచిన నేల అని పేర్కొన్నారు. వీరమంగై(వీరనారీ) వేలునాచ్చియార్‌, మరుదు సోదరులు వంటి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, ఈ నేల తమిళ గౌరవానికి ప్రతిరూపమని వ్యాఖ్యలు చేశారు. విద్య, వ్యవసాయ రంగాల్లో కీలక ప్రాజెక్టులు ఇక్కడే ఉన్నాయని ఈసందర్భంగా గుర్తు చేశారు. శివగంగ కోసం చిదంబరం ఎంతో శ్రమించారని గుర్తు చేస్తూ, ఆయన దేశానికి ఆదర్శవంతమైన వ్యక్తిగా కొనియాడారు. శివగంగ జిల్లాలో 8 పట్టణ పంచాయతీలు, 11 పంచాయతీ యూనియన్లలో 2,452 గ్రామాలు ఉన్నాయని గుర్తు చేస్తూ, ఇక్కడ రూ. 2.119 కోట్లతో ఉమ్మడి తాగునీటి పథకం ప్రాజెక్టుకు కార్యాచరణ సిద్ధం చేశామని ప్రకటించారు. ద్రావిడ మోడల్‌ ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలను విస్తృతం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. అయితే, ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నర్‌ ఏమో తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటిగా పెట్టుకుని ఉన్నారని మండిపడ్డారు. తమిళనాడును విమర్శించే ఈ గవర్నర్‌, తమిళనాడు కోసం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో తమిళనాడు అభివృద్ధి ఈ ప్రధాన మంత్రికి గుర్తుకు వస్తుందని, ఎన్ని అసత్యాలు వళ్లించాలో వళ్లించేస్తారని, ప్రజల్ని మభ్య పెట్టేందుకు తమిళగం అంటూ వెళ్లి పోతారని, చివరకు తమిళనాడు గురించి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నివేదికలే తమిళనాడును కొనియాడుతోంటే, ఇక్కడున్న గవర్నర్‌, ఓట్ల కోసం తమిళ గళాన్ని అందుకునే ప్రధాని నరేంద్ర మోదీలు ఆ నివేదికలలోని అంశాలను ఓ మారు పరిశీలస్తే బాగుంటుందని హితవు పలికారు. ఇక ఇక్కడున్న ప్రతి పక్ష నేత తమిళనాడు కోసం కేంద్రం పై ఎలాంటి ఒత్తిడి కూడా తీసుకు రాడని, ఆయనకు కేవలం స్వలాభమే ముఖ్యం అని మండిపడ్డారు. ద్రావిడ మోడల్‌ ప్రజల జీవితాలో మార్పును తీసుకొచ్చిందని ధీమా వ్యక్తం చేస్తూ, ద్రావిడ మోడల్‌ 2.ఓ మరిన్ని ప్రణాళికలతో తమిళనాడును అత్యున్నత స్థానంలో నిలబెట్టబోతోందన్నారు.

మళ్లీ గెలుస్తాం..

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పును గుర్తు చేస్తూ, దీనిని తీవ్రంగా ఖండించే విధంగా అసెంబ్లీలో సైతం తీర్మానం చేశామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల గొంతు నొక్కేస్తోందని ధ్వజమెత్తారు. వివిధ చట్టాలతో నియంత వలే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2011 ఎన్నికల మేనిఫెస్టోలో అన్నాడీఎంకే ఏం చెప్పిందో ఓ మారు గుర్తుకు తెచ్చుకోవాలంటూ చైన్నె నుండి కన్యాకుమారి కోస్టల్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌, దక్షిణ తమిళనాడులో ’ఏరో పార్క్‌’ గురించి ప్రస్తావించారు. అయితే, వాటిని అమలు చేశారా? అని ప్రశ్నిస్తూ, ఇప్పుడు మళ్లీ అదే పల్లవితో ఎన్నికలలోకి వస్తుండటం సిగ్గు చేటు అని విమర్శించారు. ప్రజలకు, వారికి ప్రభుత్వంతో కలిసి వారదిగా ఉన్న ఉద్యోగులకు సైతం న్యాయం చేకూర్చే విధంగా ద్రావిడ మోడల్‌ ముందుకు సాగిందని, చారిత్రాత్మక ఉత్తర్వులు, విజయాలను దక్కించుకున్నామని ప్రస్తావించారు. ద్రవిడ మోడల్‌ 2.ఓ ను నెరవేర్చే అవకాశం తమిళనాడు ప్రజలకు ఇస్తున్నామని, అందరూ తనకు అండగా ఉంటారన్న పూర్తి నమ్మకంతో, ప్రజల ఆనందమే తన ఆనందంగా, తమిళనాడు అభివృద్ధి లక్ష్యంగా సమష్టిగా పయనిద్దా్‌ం, గెలుద్దాం.. అని వ్యాఖ్యానించారు.

● నమ్మకంతో మరోసారి దీవించండి ● ద్రావిడ మోడల్‌తో ప్రజల జ1
1/1

● నమ్మకంతో మరోసారి దీవించండి ● ద్రావిడ మోడల్‌తో ప్రజల జ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement