క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Dec 15 2025 9:03 AM | Updated on Dec 15 2025 9:03 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

మరింత అందుబాటులోకి గృహాలు బాల గణపతి ఆలయంలో మండలాభిషేకం మురుగన్‌ ఆలయ సమీపంలో కోతకు గురైన తీరం ● సముద్రంలోకి దిగడానికి మద్యం కోసం డబ్బులు ఇవ్వనందుకు.. ● అన్న బైకు ధ్వంసం చేసిన తమ్ముడు అరెస్టు జ్యూస్‌ అనుకుని యాసిడ్‌ తాగి వృద్ధురాలి మృతి

సాక్షి, చైన్నె: మధ్యతరగతి వర్గాలకు మరింత అందుబాటులోకి గృహాలను తీసుకొచ్చేవిధంగా సరికొత్త, బృహత్తర కార్యక్రమాలపై దృష్టి పెట్టామని జీ స్క్వేర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు బాలరామజయం తెలిపారు. ఆదివారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ, తమిళనాడు వ్యాప్తంగా ప్రీమియం విల్లా ప్లాట్లపై స్టాంప్‌ డ్యూటీ చార్జీలను 50 శాతం తగ్గించినట్టు ప్రకించారు. ఇది క్రిస్మస్‌, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నారు. చైన్నె, కోయంబత్తూరు, తిరుచ్చి, తిరునల్వేలి, మధురై వంటి నరాగాల్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.మధ్య తరగతి వర్గాలకు మరింత అందుబాటులోకి సొంతింటి కలను సాకారం చేయడం లక్ష్యంగా విస్తృతం కార్యాచరణతో ముందుకెళ్తున్నామన్నారు.

తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని శ్రీనివాసపురంలో మునీశ్వరర్‌, బాల గణపతి, పెరియపాళయత్తు అమ్మన్‌ ఆలయం నిర్మించి గత నెల మహాకుంభాభిషేకం పూర్తి చేశారు. దీంతో 48 రోజుల పాటూ మండలాభిషేకం పూజలు నిర్వహించారు. మండలాభిషేకంలో చివరి రోజైన ఆదివారం ఉదయం మహిళలు 108 పాలబిందెల ఊరేగింపుగా వెళ్లి బాల గణపతికి అభిషేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో యాగశాల ఏర్పాటు చేసి శంఖాభిషేకం పూజలు చేపట్టి మునీశ్వరర్‌, బాల గణపతి, పెరియ పాళయత్తమ్మన్‌కు విశేష పూజలు చేపట్టారు. పూజల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. భక్తులందరికీ ప్రసాదాలు, అన్నదానం పంపిణీ చేశారు.

భక్తుల ఇక్కట్లు

కొరుక్కుపేట: తిరుచెందూర్‌ మురుగన్‌ ఆలయం సమీపంలో 6 అడుగుల లోతున సముద్ర కోత ఏర్పడింది. దీంతో సముద్రంలోకి దిగడానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వివరాలు.. తిరుచెందూర్‌ సుబ్రమణ్య స్వామి ఆలయంవద్ద బీచ్‌ ఉంది. దీని కారణంగా, ఆలయానికి వచ్చే భక్తులు సముద్రంలో పవిత్ర స్నానం చేసిన తర్వాతే స్వామి దర్శనం చేసుకుంటారు. ఈ పరిస్థితిలో, గత కొన్ని వారాలుగా దక్షిణ తమిళనాడు తీరప్రాంతాల్లో అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. ఆ తర్వాత, సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. తదనంతరం, తిరుచెందూర్‌ సుబ్రమణ్య స్వామి ఆలయం ముందు భాగంలో జరిగిన కోత కారణంగా, గత 3 రోజులుగా దాదాపు 100 అడుగుల పొడవు 3 అడుగుల నుండి 6 అడుగుల లోతు వరకు సముద్ర కోత జరిగింది. దీని కారణంగా, బీచ్‌లోని ఆలయం ముందు ఉన్న ఫుట్‌బ్రిడ్జి ప్రాంతం నుంచి భక్తులు సముద్రంలోకి దిగలేకపోయారు.

అన్నానగర్‌: చైన్నెలోని పుదుచ్చేరిలో మద్యం కోసం డబ్బులు ఇవ్వడానికి నిరాకరించినందుకు తన అన్న బైకుకు నిప్పంటించి, ధ్వంసం చేసిన తమ్ముడిని పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె పుదువన్నారపేటలోని అన్నై సత్యనగర్‌లో నివాసం ఉంటున్న శేఖర్‌ (40). ఇతను శనివారం రాత్రి తన ఇంటి పక్కన తన బైక్‌ను పార్క్‌ చేసి నిద్రించడానికి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు, శబ్దం విని మేల్కొన్నప్పుడు, ఎవరో బైక్‌కు నిప్పంటించి, దానిని ధ్వంసం చేసి పారిపోయారని అతను గమనించాడు. ఫిర్యాదు ఆధారంగ పుదుచ్చేరిలోని పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. పుదువన్నారపేటకు చెందిన రాజ్‌కమల్‌ (32)ను అరెస్టు చేశారు. దర్యాప్తులో, రాజ్‌కమల్‌ తన అన్న శేఖర్‌ను తాగడానికి డబ్బులు అడిగినట్లు వెల్లడైంది. అతను డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆగ్రహించిన ఆ వ్యక్తి ద్విచక్ర వాహనానికి నిప్పంటించినట్లు తెలిసింది.

పళ్ళిపట్టు: జ్యూస్‌ అనుకుని యాసిడ్‌ తాగిన వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన ఘటన పళ్లిపట్టులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పళ్లిపట్టు ఆంజనేయనగర్‌కు చెందిన ధనమ్మ(85) శనివారం సాయంత్రం ఆమె ఇంట్లో బాత్రుమ్‌ శుభ్రం చేసేందుకు తెచ్చి వుంచిన యాసిడ్‌ను జ్యూస్‌ అనుకుని తాగేశారు. దీంతో ఆమెకు వాంతులు విరేచనాలు చోటుచేసుకుని కడుపులో మంటలు చోటుచేసుకోవడంతో నొప్పితో తల్లడిల్లారు. ఆమెను కుటుంబీకులు 108 అంబులెన్స్‌ సాయంతో తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి అక్కడ ప్రథమ చికిత్స అనంతరం తిరువళ్లూరు ప్రభుత్వాసుపత్రిలో తీసుకెళ్లి వైద్యులు చికిత్స చేశారు. అయితే యాసిడ్‌కు పేగులు కాలిపోయి ప్రాణాలు కోల్పోయారు. పళ్లిపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement