ఒకే వేదికగా వెన్నెముక సంరక్షణ నిపుణులు
– మంత్రి పీటీఆర్
సాక్షి, చైన్నె : వెన్నెముక సర్జన్లు, పునరావాస నిపుణులు, న్యూరో సైంటిస్టులు, అనుబంధ ఆరోగ్య నిపుణులను ఒకే వేదిక పైకి తెచ్చే విధంగా చైన్నె అంతర్జాతీయ సదస్సు వేదికగా నిలిచిందని ఐటీ మంత్రి పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్ వ్యాఖ్యానించారు. కావేరి ఆస్పత్రి, హంస రిహబ్ ఇస్సికాన్ –2025 అంతర్జాతీయ వెన్నెముక సదస్సుకు చైన్నె వేదికగా నిలిచింది. 3 రోజుల ఈ సదస్సును మంత్రి పళణి వేల్ త్యాగరాజన్ ప్రారంభించారు. వెన్నెముక గాయం, వెన్ను పాము గాయాల సంరక్షణలో ఆవిష్కరణలు, పురోగతులకు ఈ సదస్సు వేదిక కావాలని తన ప్రసంగంలో మంత్రి ఆకాంక్షించారు. స్పైనల్ కార్డ్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ హెచ్ ఎస్ ఛబ్రా కార్యదర్శి డాక్టర్ జి బాల మురళీ, కావేరి సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్‌లతో పాటూ 500 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ స్థాయినిపుణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


