
దొంగల ముఠా అరెస్టు
– బంగారు నగలు, మోటార్ సైకిళ్లు స్వాధీనం
తిరుపతి క్రైం: నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు దొంగల ముఠాను క్రైమ్ పోలీసులు అరెస్టు చేసినట్లు క్రైమ్ ఏఎస్పీ నాగభూషణరావు, ఎల్‌అండ్‌ఓ రవిమనోహరాచారి తెలిపారు. శనివారం క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కుప్పం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఎస్.జ్యోతి(32), వి.నందిని(30), ఎ.ప్రియా, (26) ముగ్గురు ముఠాగా ఏర్పడి జిల్లాలోని బస్‌స్టాండ్లు, ప్రయాణికుల గుమికూడే ప్రాంతాల్లో బ్యాగులు చోరీ చేసేవారన్నారు. వీరిపై విశాఖపట్నం, మల్కాపురం, కోడూరు, అలిపిరి, తమిళనాడు ప్రాంతాల్లో పాత కేసులు నమోదై ఉన్నాయన్నారు. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన కొండరాజు రత్తయ్య అలియాస్ రత్తయ్య (29), తిరుపతికి చెందిన కందన్ సాయి అలియాస్ ఆటోసాయి( 28) మీరు ముగ్గురు ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను చోరీలకు పాల్పడేవారు. వీరిపై తిరుపతి, పుత్తూరు, గాజులమండ్యం, పాకాల, కార్వేటినగరం, కడప, నెల్లూరు జిల్లాలలో పాత కేసులు ఉన్నాయన్నారు. తమ బృందాలు పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి సమాచారం సహకరించామన్నారు. అందులో భాగంగానే మహిళా దొంగలను జైశ్యామ్ థియేటర్ వద్ద, ద్విచక్ర వాహనాలు చోరీలు పాల్పడుతున్న దొంగలను నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ వద్ద అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి 5 కేసులకు సంబంధించి రూ.25 లక్షల విలువ చేసే 230 గ్రాములు బంగారు నగలు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసును ఛేదించడంలో డీఎస్పీలు, సిఐలు ఎంతగానో కృషి చేశారన్నారు.
శాస్త్రోక్తంగా తైలాభిషేకం
ఇరుగు పొరుగు