
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
– చెస్ గ్రాండ్ మాస్టర్ కార్తికేయన్
కొరుక్కుపేట: క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెస్ గ్రాండ్ మాస్టర్, ఐసీఎఫ్ సీనియర్ అకౌంటెంట్ పి.కార్తికేయన్ అన్నారు. చైన్నె పెరియమెట్‌లో ఉన్న నెహ్రూ స్టేడియంలో శనివారం ఎస్‌కేపీడీ అండ్ ఛారిటీస్ నిర్వహణలోని మహర్షి విద్యామందిర్ సీనియర్ సెకండరీ పాఠశాల 11వ వార్షిక స్పోర్ట్స్ మీట్ పాఠశాల కరస్పాండెంట్ టీవీ రామకుమార్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ప్రిన్సిపల్ పి. సుబ్రమణ్యం స్వాగతం పలికిన ఈ వేడుకల్లో చెస్ గ్రాండ్ మాస్టర్ కార్తికేయన్ ముఖ్యఅతిథిగా పాల్గొని సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ కేటగిరీలకు నిర్వహించిన వివిధ క్రీడాపోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థిని, విద్యార్థులకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగదు బహుమతి, అలాగే ఓవరాల్ చాంపియన్ జట్టుకు ఎస్ కె పీడీ ట్రస్టీలు దేసు లక్ష్మీనారాయణ, ఎస్‌ఎల్ సుదర్శనం, సీఆర్,కిషోర్ బాబు , తాతా బద్రీనాథ్, కార్యదర్శి ఎం.కిషోర్ కుమార్ ట్రోఫీలను అందజేసి అభినందించారు. పాఠశాల మేనేజర్ శ్రీలత, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.