
కమనీయం..లక్ష్మీ నరసింహుడి కల్యాణం
రాపూరు: పెంచలకోన క్షేత్రంలో శనివారం పెనుశిల లక్ష్మీనరసింహాస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు అభిషేకం, 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు పూలంగిసేవ నిర్వహించారు. 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నిత్యకల్యాణ మండపంలో కొలువుదీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛరణలతో కల్యాణం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు స్వామి అమ్మవార్లను తిరుచ్చిలో సహస్రదీపాలంకరణ మండపంలోకి తీసుకువచ్చి అర్చకులు ఊంజల్‌సేవ నిర్వహించారు.