
స్థానిక సమస్యలకు.. తక్షణం పరిష్కారం
వేలూరు: గ్రామ సభల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల కు పరిష్కారం లభిస్తుందని కలెక్ట ర్ సుబ్బలక్ష్మి తెలిపారు. గాంధీ జ యంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో శనివారం ఉదయం గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లోని ఆదాయం, ఖ ర్చుల వివరాలను ప్రజలకు తెలియజేసి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం పరిధిలోని మేల్‌పాడి గ్రామ పంచాయతీలో కలెక్టర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని వివిధ సమస్యలపై వచ్చిన వినతులను స్వీకరించి, వాటిలో కొన్నింటిని అ క్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా గ్రామీణ ప్రాంతా ల్లోని పలు సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. గ్రామ పంచాయతీ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ని ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించా లని ఆదేశించారన్నారు. సమస్యలను ఆయా సర్పంచ్ లు, వార్డు సభ్యులకు తెలియజేసి, వాటిలో అర్హులైన వారికి పథకాలను అందజేస్తామన్నా రు. కొన్నింటిని సంబంధిత అధికారులతో విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం మేల్‌పా డి పంచాయతీలో పెన్షన్ల కోసం అ నేక మంది వినతి పత్రాలు సమర్పించారని, వీటిని పరిష్కరించేందుకు చ ర్యలు తీసుకుంటామన్నారు. ఈ గ్రా మసభలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అదే విధంగా అ నకట్టు నియోజకవర్గంలో గంగనల్లూ రు గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించి, ప్రజలకు అన్నదానం చేశారు. అదే విధంగా కాట్పాడి తాలూకా అమ్ముండి, పెరుముగై తదితర పంచాయతీల్లో ఆయా సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. వీటిలో అధికంగా పెన్షన్‌లకు సంబంధించి వినతులు రావడంతో వాటిని ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తామని తెలిపారు.