దీపావళికి..
సాక్షి, చైన్నె: దీపావళిని పురస్కరించుకుని రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బాణసంచా వంటి పేలుడు వస్తువులను తరలించే వారిపై నిఘా ఉంచారు. అన్ని స్టేషన్లలో సోదాలు విస్తృతం చేశారు. పండుగలు ఎన్ని ఉన్నా దీపావళి పండుగంటే అందరికీ ప్రత్యేకం. అందునా తమిళనాడు ప్రజలు దీపావళికి చేసినంతగా మరే పండుగకు సందడి చేయరు. ధనికులే కాదు బీదా బిక్కీ అయినా సరే కొత్త దుస్తులు కొనాల్సిందే, బాణాసంచా కాల్చాసిందే. అందుకే షాపింగ్‌లో ఆసియా ఖండంలోనే పేరుగాంచిన చైన్నె టీనగర్ దీపావళికి పది పదిహేను రోజులకు ముందునుంచే జనసంద్రంగా మారిపోతుంది. మరీ టీ నగర్ రంగనాధన్ వీధి అయితే రద్దీతో కాలుమోపేందుకు కూడా చోటుండదు. దీపావళి షాపింగ్ రోజుల్లో జనం దొంగల బారిన పడకుండా ఇప్పటికే చైన్నె పోలీసు యంత్రాంగం భద్రతను పటిష్టం చేసింది. ఆయా ప్రాంతాలో అమర్చిన సీసీటీవీ కెమెరాలను కంట్రోలు రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు.
బాణసంచా దుకాణాలు
దీపావళి అంటే బాణసంచా తప్పనిసరి. వీటి విక్రయం కోసం ఐలాండ్ గ్రౌండ్‌లో ప్రత్యేక ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. అలాగే చైన్నె, శివారులలో సుమారు 9 వేల దుకాణాలకు దరఖాస్తులు రాగా, 6 వేల దరఖాస్తులను అగ్నిమాపక శాఖ పరిశీలించి అనుమతి ఇచ్చింది. మిగిలిన వాటిలో 681 తిరస్కరించగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. అన్ని రకాల నిబంధనలు తప్పని సరిగా అమలయ్యే రీతిలో అగ్నిమాపక శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక మద్యం స్టాక్‌ను పూటుగా ఉంచేందుకు మార్కెటింగ్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. ఈ దీపావళి సందర్భంగా జరిగే వ్యాపారాన్ని బట్టి ఈ ఏడాది టాస్మాక్ ఆదాయం రూ. 50 వేల కోట్లను దాట వచ్చు అన్న సంకేతాలు వెలువడ్డాయి. దీపావళి సందర్భంగా రెండు మూడు రోజుల పాటూ రోజుకు కనీసం రూ.500 కోట్లకు పైగా అమ్మకాలు జరిగే రీతిలో చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అన్ని టాస్మాక్ మద్యం దుకాణాలకు సరికొత్త బ్రాండ్‌లను సిద్ధం చేసి పంపించే పనిలో పడ్డారు.
డాగ్ స్క్వాడ్ తో సోదాలు
రైళ్లలో..
దక్షిణి రైల్వే చైన్నె డివిజన్ రైళ్లలో బాణసంచా, మండే వస్తువులను తీసుకెళ్ల వద్దు అని ప్రయాణికులకు రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే అన్ని రైల్వే స్టేషన్లలో నిఘాపెంచారు. ప్రయాణికుల బ్యాగ్‌లను తనిఖీలఅనంతరం అనుమతిస్తున్నారు. ఎవరైనా నిషేధిత వస్తువులు తీసుకెళ్లిన పక్షంలో రైల్వేచట్టం 1989 ప్రకారం నేరం అని మూడు సంవత్సరాలు జైలు శిక్ష లేదా రూ.1000 జరిమానా లేదా రెండు విధించేందుకు అవకాశం ఉందని ప్రయాణికులకు హెచ్చరిస్తూ వస్తున్నారు. పండుగ సీజన్‌లలో సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించే విధంగా ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ వర్గాలు అన్ని రైల్వే స్టేషన్లలో నిఘానుకట్టుదిట్టం చేశారు. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు, స్నిపర్ డాగ్ స్క్వాడ్‌లతో సోదాలు చేసే పనిలో పడ్డారు. అలాగే, ప్రయాణికులకు భద్రతా అవగాహనకు సంబందించిన కరప్రతాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు.
నిఘానేత్రం
నిఘానేత్రం
నిఘానేత్రం
నిఘానేత్రం