
మంచి కంటెంట్‌తో మరుదం
తమిళసినిమా: నటుడు విదార్ధ్, నటి రక్షణ జంటగా నటించిన మరుదం చిత్రంలో మారన్ ,అరుణ్ దాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.అరువర్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సి. వెంకటేషన్ నిర్మించిన ఈ చిత్రానికి గజేంద్రన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఓ కుగ్రామంలోని రైతుల జీవన విధానాన్ని తెరపై ఆశించిన కథా చిత్రం ఇది ముఖ్యంగా రైతుల పొలాలను కొందరు బ్యాంక్ అధికారులు రుణాల పేరుతో ఎలా దురాక్రమణకు పాల్పడుతున్నారు అన్న అంశాన్ని ఇతివ్రతంగా తీసుకొని రూపొందించిన చిత్రం మరుదం. అదేవిధంగా మోసపూరితంగా తమ పొలాలను ఆక్రమించుకున్న వారిపై న్యాయపోరాటం చేసే ఒక రైతు కథ ఈ చిత్రం. నే స్థానంలో న్యాయవాదిని నియమించుకొని వాదించే ఆర్థిక స్తోమత లేని వారు తమ తరపున తామే ఎలా వాదించుకుని న్యాయాన్ని పొందవచ్చు అని అంశంపై అవగాహన కలిగించే చిత్రంగా ఇది రూపొందింది. అలా తన తండ్రి వారసత్వంగా వచ్చిన పొలాన్ని పండించుకుంటూ ఆదర్శ రైతుగా పేర్చుకున్న ఓ యువకుడు ఒక దుర్మార్గపు బ్యాంక్ అధికారి మోసానికి గురై తనకున్న కొద్దిపాటి పొలాన్ని కోల్పోతాడు. దీంతో అతను తన పొలాన్ని దక్కించుకోవడానికి చేసే పోరాటమే మరుదం చిత్రం. అతను ఆ పోరాటంలో గెలిచాడా? లేదా? అన్న ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన ఈ చిత్రం కోసం శుక్రవారం తెరపైకి వచ్చింది. సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. మంచి కంటెంట్ ఉంటే స్టార్ హీరోస్ లేకున్నా చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తాయనేందుకు ఈ చిత్రం ఒక మంచి ఉదాహరణగా సినీవర్గాలు పేర్కొంటున్నారు.
మరుదం చిత్రంలో విదార్థ్, నటి రక్షణ