
ఆరోగ్య సంరక్షణ రాజధానిగా చైన్నె
– జేసీఐ గుర్తింపు
సాక్షి, చైన్నె: ఆరోగ్య సంరక్షణ రాజధానిగా చైన్నె స్థానాన్ని బలోపేతం చేస్తూ ఆళ్వార్ పేట కావేరి ఆస్పత్రి జేసీఐ గుర్తింపు సాధించింది. ఈ మేరకు గురువారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. జనవరిలో వడపళణి యూనిట్‌కు ఈ గుర్తింపు దక్కగా, తాజాగా ఆళ్వార్ పేట యూనిట్‌ను ప్రతిష్టాత్మక జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్(జేసీఐ)8వ ఎడిషన్ అక్రిడిటేషన్ వరించింది. ఆరోగ్య సంరక్షణ, రోగి భద్రత, క్లినికల్ ఎక్సలెన్స్, పారదర్శకత, అత్యవసర ఏర్పాట్లు,నిరంతరం అభివృద్ధి, గ్రీన్ హాస్పిటల్,తదితర అంశాల ఆధారంగా ఈ గుర్తింపు కేటాయించారు. ఈ విజయం గురించి కావేరి సహ వ్యవస్థాపకుడు డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ మాట్లాడుతూ, ఇది సంస్థాగత మైలు రాయిగా కంటే ఎక్కువ అని అభివర్ణించారు. మెగురైన సేవలు, సమన్వయం, ఆరోగ్య సంరక్షణ, అధిక నాణ్యత , సమాజ సేవ, అధునాతన సాంకేతికత అంశాలు ఈ గుర్తింపు దక్కేలా చేసిందన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎఎన్ వైదీశ్వరన్, మెడికల్ డైరెక్టర్ అయ్యప్పన్ పొన్నుస్వామి, మెడికల్ సూపరింటెండెంట్ మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.