
వేళమ్మాళ్ క్రికెట్ స్టేడియం ప్రారంభం
సేలం: మదురైలోని వేళమ్మాళ్ క్రికెట్ స్టేడియాన్ని క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వేళమ్మాళ్ విద్యా సంస్థల చైర్మన్ ఎంవీఎం ముత్తురామలింగం హాజరయ్యారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఈ స్టేడియం, యువ ఆటగాళ్ల నైపుణ్యాభివృద్ధికి కొత్త వెలుగు అని, ఇందులో అంతర్జాతీయ ప్రమాణాల పిచ్, పగలు, రాత్రి లైట్లు, ఆధునిక గదులు, డిజిటల్ స్కోర్‌బోర్డ్, ప్రాక్టీస్ నెట్‌లు, జిమ్, మీడియా, వీఐపీ ప్రాంతాలు ఉన్నాయి. గ్యాలరీలు, ప్రేక్షకుల కోసం పెద్ద సీట్ల ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం ఆధునిక సాంకేతికతతో నిర్మించడంతో వర్షం పడిన 10 నిమిషాల్లో మైదానం ఎండిపోతుంది.