
సీబీఐ విచారణకు పట్టు!
న్యూస్‌రీల్
వాడీవేడిగా వాదనలు సుప్రీంకోర్టుకు కరూర్ ఘటన హైకోర్టు భిన్న ఉత్తర్వులపై ప్రశ్నలు సమగ్ర సమాచారంతో రిట్ దాఖలుకు అవకాశం బాధితుల పరామర్శకు విజయ్ కసరత్తు
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కరూర్ ఘటన శుక్రవారం సుప్రీంకోర్టుకు చేరింది. సీబీఐ విచారణకు పట్టుబడుతూ వాడీవేడిగా వాదనలు జరిగాయి. ఒకే వ్యవహారంలో మద్రాసు హైకోర్టు, మదురై ధర్మాసనం భిన్న ఉత్తర్వులు జారీ చేయడం గురించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల
బెంచ్ ప్రశ్నలను సంధించింది. హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న సిట్ విచారణ గురించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ,
విల్సన్ వాదనలు వినిపించారు. చివరకు రిట్ పిటిషన్ దాఖలుకు అవకాశం
కల్పించారు.
సాక్షి, చైన్నె : గతనెల 27వ తేదీన తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో చోటుచేసుకున్న ఘటనలో 41 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణకు విజయ్ తరఫున హైకోర్టు మదురై ధర్మాసనంను ఆశ్రయించారు. ఇదే నినాదంతో మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, ఈ పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. అదే సమయంలో ప్రచార సభల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాల రూపకల్పన కోసం మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ పరిగణించారు. ఈ విచారణ సమయంలో ఆయన విజయ్ పార్టీ వర్గాలకు అక్షింతలు వేశారు. అలాగే, సిట్ విచారణకు ఆదేశిస్తూ ప్రత్యేక అధికారిగా ఐజీ అష్రాకార్గ్‌ను నియమించారు. ఇద్దరు మహిళా ఐపీఎస్‌లతో పాటు మరో ఎ నిమిది మంది అధికారులతో అష్రాకార్గ్ బృందం కరూర్‌లో తిష్ట వేసి విచారణలో దూసుళుతోంది. ఈ సిట్ విచారణకు వ్యతిరేకంగా టీవీకే నేత విజయ్‌తో పాటు బాధిత కుటుంబాల్లో ఒకరైన ప్రభాకర్, ఓ సంస్థకు చెందిన సెల్వరాజ్‌తో పాటు పలువురు సుప్రీంకోర్టు తలుపు తట్టారు.
విచారణకు పిటిషన్
ఈ పిటిషన్లను న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఎన్‌వీ అంజిరియాలతో కూడిన బెంచ్ శుక్రవారం విచారణకు స్వీకరించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడీవేడిగా వాదనలు హోరెత్తాయి. విజయ్ తరఫు న్యాయవాదులు తమ వాదనలలో రాష్ట్ర పోలీసుల విచారణపై నమ్మకం లేదని స్పష్టం చేశారు. ఎవరిపై తాము అనుమానం వ్యక్తం చేస్తున్నామో, వారి ద్వారానే విచారణ జరిగిన పక్షంలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేదని వాదించారు. కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తును పర్యవేక్షించడానికి మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తిని నియమించాలని కోరారు. సుప్రీంకోర్టు నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. మదురై ధర్మాసనం విచారణలో జారీ చేసిన ఉత్తర్వులు, మద్రాసు హైకోర్టు విచారణలో జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు ముందు ఉంచారు. కేసుతో సంబంధం లేని అంశం విచారణలో విజయ్‌ను ఉద్దేశించి హైకోర్టు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు, అక్షింతలు వేసినట్టు వివరించారు. విజయ్ ఎక్కడా పారిపోలేదని వాదించారు. తప్పనిసరిగా పేర్కొంటూ పోలీసులు ఇచ్చిన సూచన మేరకే ఆయన కరూర్‌ను వీడి చైన్నెకు వచ్చినట్టు వాదించారు. ఇక, ఇతర పిటిషనర్ల తరఫున వాదించిన న్యాయవాదులు కేసును సీబీఐకి అప్పగించాలని పట్టుబట్టారు. తమిళనాడు పోలీసులపై నమ్మకం లేదని వాదించారు. అదే సమయంలో ఈ ప్రచారంలోకి సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించారంటూ ఆధార రహిత ఆరోపణలు చేశారు. అలాగే, రాత్రికి రాత్రే పోస్టుమార్టం చేశారంటూ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. పోలీసుల వైఫల్యమే ఈ ఘటనకు కారణంగా స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదుల బలంగానే వాదనలు వినిపించారు. ప్రచారానికి గట్టి భద్రత ఏర్పాట్లు చేశామని, సంఘ విద్రోహ శక్తుల ప్రవేశం అన్నది ఆధారరహితంగా వ్యాఖ్యలు చేశారు.
విజయ్‌కరూర్ ప్రచారం (ఫైల్)
సర్కారుకు చుక్కెదురు!
విజయ్ కసరత్తు
పోలీసులు అనుమతి ఇచ్చిన పక్షంలో సోమవారం కరూర్‌లో పర్యటించేందుకు విజయ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బాధితులందర్నీ ఒకే చోటకు పిలిపించి పరామర్శించి, పార్టీ తరఫున రూ. 20 లక్షలు నష్ట పరిహారం అందించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డీజీపీ కార్యాలయం సూచన మేరకు కరూర్ జిల్లా యంత్రాంగాన్ని విజయ్ తరఫున అనుమతి కోసం శుక్రవారం విన్నవించారు. భద్రత కల్పించాలని కోరారు. ఈ కేసును విచారిస్తున్న అష్రాకార్గ్ నేతృత్వంలోని సిట్ బృందం కొత్త కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. విజయ్ ప్రచార సభలో ఏకంగా 60కు పైగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించి వీడియో చిత్రీకరించినట్టు గుర్తించినట్టు సమాచారం. దీంతో జన సందోహాన్ని తరలించి, ఇక్కడ విజయ్ నటిస్తున్న జననాగయం షూటింగ్ ఏమైనా రహస్యంగా చిత్రీకరించారా అనే అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఆ కోణంలో సైతం దర్యాప్తు సాగుతున్నట్టు సమాచారం.
భిన్న ఉత్తర్వులా...?
మదురై ధర్మాసనం, మద్రాసు హైకోర్టు కరూర్ వ్యవహారంలో భిన్న ఉత్తర్వులు ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు పరిగణించింది. కరూర్ కేసులన్నీ ధర్మాసనంలో ద్విసభ్య బెంచ్ విచారణలో ఉన్నప్పుడు, ప్రచార సభల నిర్వహణకు మార్గదర్శకాల వ్యవహారంలో మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ తాజా ఘటన గురించి ఎందుకు స్పందించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అస్సలు ఎందుకు మద్రాసు హైకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్టుగా పేర్కొంటూ పలు ప్రశ్నలను సంధించారు. ద్విసభ్య ధర్మాసనం, మద్రాసు హైకోర్టు సింగిల్ బెంచ్ ఒకే రోజు ఈ భిన్న ఉత్తర్వులు ఎందుకు ఇచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ తరఫున న్యాయవాదులు స్పందిస్తూ సిట్‌ను తమిళనాడు ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేయలేదని, హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైనట్టు వివరించారు.ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారి అష్రాకార్గ్ సీనియర్ అని, ఆయన సీబీఐలో సైతం పనిచేశారని వివరించారు. ప్రచార సభలో ఈ ఘటనకు కారణం విజయ్ ఆలస్యంగా రావడమేనని వాదించారు. మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సిన విజయ్ రాత్రి 7 గంటలకు వచ్చారని వివరించారు. అప్పటికే జనం ఆహారం, నీళ్లు లేకుండా నిరసించి ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఈ సభలోకి రౌడీలు చొరబడ్డా, సంఘ విద్రేహ శక్తులు చొరబడ్డారు అన్న వాదనలకు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయమూర్తుల బెంచ్ ముందు అభ్యర్థనను ఉంచారు. కేసు ప్రస్తుతం సిట్ నేతృత్వంలో సరైన కోణంలో వెళ్తున్నట్టు, సీబీఐ విచారణకు అప్పగించాల్సిన అవసరం లేదని కోరారు. అలాగే, ఈ కేసుకు సంబంధించి, పిటిషనర్ల వాదనలకు సంబంధించిన సమగ్ర వివరాలతో రిట్ పిటిషన్ దాఖలుకు తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు బెంచ్ సమగ్ర వివరాలను లిఖిత పూర్వకంగా ఉండాలని ఆదేశిస్తూ తీర్పును రిజర్వులో పెట్టింది. దీంతో ఈ కేసు సీబీఐకి అప్పగించేనా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

సీబీఐ విచారణకు పట్టు!

సీబీఐ విచారణకు పట్టు!