
పళ్లిపట్టులో 7 సెం.మీ. వర్షపాతం
పళ్లిపట్టు: పట్టణ పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో కుస్థలినది పరవళ్లు తొక్కుతుంది. మూడు నేలమట్టం వంతెనలు నీట మునిగాయి. రెండు వంతెనలు కూలడంతో గ్రామీణుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పళ్లిపట్టు పరిసర ప్రాంతాల్లో ఇటీవల వర్షాలతో భూగర్భజలాలు నిండుతున్నాయి. వర్షంతో కొండల నుంచి వరదతోపాటు ఆంధ్రాలోని కృష్ణాపురం జలాశయం నిండి నాలుగు రోజుల కిందట మిగులు జలాలు విడుదలతో పళ్లిపట్టు సమీపంలోని కుశస్థలి నదిలో వరదపోట్టెత్తింది. నెడియం, సామంతవాడలోని నేలమట్టం తాత్కాలిక వంతెనలు కూలాయి. దీంతో తీర ప్రాంతాల్లోని గ్రామీణులకు రాకపోకలకు అంతరాయం కలిగింది.