పెరుగుతున్న చాక్లెట్‌ అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న చాక్లెట్‌ అమ్మకాలు

Jul 14 2025 5:01 AM | Updated on Jul 14 2025 7:47 AM

-

షేడ్‌ హౌస్‌ నిర్మాణానికి భూమి పూజ

కొరుక్కుపేట: పూందమల్లి బైపాస్‌ బస్టాండ్‌ వద్ద రూ.35 కోట్లతో పెద్ద షేడ్‌ హౌస్‌ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా పూందమల్లి నగర్‌లోని 20వ వార్డులోని శక్తినగర్‌లో రూ.16 లక్షలతో కొత్త దుకాణ భవనాన్ని నిర్మించడానికి భూమి పూజను ఎమ్మెల్యే కృష్ణసామి చేశా రు. డీఎంకే నగర కార్యదర్శి జీ.ఆర్‌. తిరుమల ము న్సిపాలిటీ చైర్మన్‌ కాంచన, వైస్‌ చైర్మన్‌ కే.శ్రీధర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.శరవణ కుమార్‌, పారిశుధ్య అధికారి గోవిందరాజ్‌, డీఎంకే కార్యనిర్వా హకులు ఏ.విమల్‌ ఆనంద్‌, మాజీ పబ్లిక్‌ ప్రాసి క్యూటర్‌ రాజేంద్రన్‌, పి.అన్బళగన్‌ పాల్గొన్నారు.

నీలగిరిలో పెరుగుతున్న చాక్లెట్‌ అమ్మకాలు

కొరుక్కుపేట: నీలగిరిలోని ఒక చాక్లెట్‌ దుకాణం పర్యాటకులను ఆకర్షిస్తోంది. కిలోల చొప్పున అమ్ముతున్నారు. కేజీ రు.800లకే విక్రయంతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. భారతదేశానికి వచ్చిన అంకోరియన్లు తమ సొంత అవసరాల కోసం తమ ఇళ్లలోనే కేక్‌లు, చాక్లెట్‌లు తయారు చేసుకోవడం ప్రారంభించారు. నేడు దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన వంటకాలు అమితంగా ఇష్టపడుతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడులో ఇంట్లో తయారు చేసిన మాచా చాక్లెట్లు ఉదయపూర్‌, కొడైకెనాల్‌ వంటి కొన్ని కొండ ప్రాంతాల్లో మాత్రమే తయారవుతాయి. మంచి నాణ్యత గల, స్వచ్ఛమైన కోకో ఆధారిత, ఇంట్లో తయారుచేసిన చాక్లెట్లు కూడా కిలోకు రూ.800కు లభిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement