తిరుత్తణి ప్రభుత్వాసుపత్రిలో సిద్ధ వైద్య కేంద్రానికి భూ
తిరుత్తణి: తిరుత్తణి ప్రభుత్వాసుపత్రి భవనంలో సిద్ధ వైద్య కేంద్రానికి అదనపు భవన నిర్మాణానికి వీలుగా ఆయుష్ సంక్షేమ నిధి నుంచి రూ.37.50 లక్షల వ్యయంతో భవన నిర్మాణపు పనులకు శనివారం భూమిపూజ నిర్వహించారు. ఇందులో తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని అదనపు భవనం నిర్మాణంకు వీలుగా భూమి పూజతో కట్టడం నిర్మాణపు పనులను ప్రారంభించారు. ఇందులో ప్రజా పనుల శాఖ సహాయ ఇంజినీరు మురళి, డీఎంకే పట్టణ కార్యదర్శి వినోత్‌కుమార్, పట్టణ నాయకులు గణేశన్, శ్యామ్‌సుందర్, అశోక్‌కుమార్ సహా ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


