మెల్లిసై ఫస్ట్‌లుక్‌కు వెట్రిమారన్ ప్రశంసలు
తమిళసినిమా: ఇంతకుముందు వెప్పం కుళీర్ మలై వంటి మంచి విజయాన్ని అందుకున్న చిత్రాన్ని నిర్మించిన ఎష్టేక్ ఎఫ్‌డీఎఫ్‌ఎస్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం మెల్లిసై. తీరం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్ కుమార్,సుభద్ర రాబర్ట్ జంటగా నటిస్తున్నారు. జార్జ్ మరియా, హరీష్ ఉత్తమన్, జస్వంత్ మణికంఠన్, తనన్య, ప్రోక్టీవ్ ప్రభాకర్, కన్నన్ భారతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్లు విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోందని చిత్రవర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వెట్టిమారన్ ఎంతగానో అభినందించారని మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మంచి కథ కథనాలతో కూడిన చిత్రాలను అభినందించి, ఆదరించే దర్శకుడు వెట్రిమారన్ కవితాత్మకతతో కూడిన కుటుంబ కథా చిత్రం అయిన తమ మెల్లిసై చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ప్రశంసించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా అన్నాడు మట్టుమ్ అండమ్ తేడుం ( ప్రేమ మాత్రమే ప్రపంచాన్ని అన్వేషిస్తుంది) అనే టాగు చిత్ర కథను ప్రతిబింబిస్తోందని ప్రసంగించారన్నారు. తండ్రి కూతుర్ల మధ్య అందమైన అనుబంధాన్ని ఆవిష్కరించే కథాచిత్రంగా మెల్లిసై ఉంటుందన్నారు. ప్రేమ, లక్ష్యం, ఓటమి, గెలుపు వంటి ఘటనల
సమహారమే ఈ చిత్రం అని యూనిట్ వర్గాలు తెలిపారు.


