31న తెరపైకి ‘ఆన్బావం పొల్ల్దాదు’
తమిళసినిమా: మంచి కుటుంబ కథ చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్న యువ కథానాయకులలో రియోరాజ్ ఒకరు. ఈయన ఇంతకుముందు నటించిన జ్యో చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అందులో నటి మాళవిక మనోజ్ నాయకిగా నటించారు. తాజాగా మరోసారి రియోరాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించిన తాజా చిత్రం ఆన్బావం పొల్లదదు. ఈ చిత్రం ద్వారా కలైయరసన్ తంగవేల్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు నటి షీలా, ఆర్ జె.విఘ్నేష్ రాజ్ తతలు ముఖ్యపాత్రులు పోషించిన ఈ చిత్రాన్ని డ్రమస్టిక్ ప్రొడక్షన్ పతాకంపై. వెడిక్కరపట్టి ఎస్.శక్తివేల్ నిర్మించారు సిద్దు కుమార్ సంగీతాన్ని, మాదేశ్ మాణిక్యం ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని అక్టోబర్ 31 తేదీన తెరపైకి రానుంది. విచిత్రాన్ని తమిళనాడులో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇంతకుముందు మహిళల సమస్యలతో ఇతివృత్తంతో పలు చిత్రాలు వచ్చాయన్నారు. అయితే పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలతో కథతో ఎందుకు చిత్రాన్ని చేయరాదన్న ఆలోచనతో రూపొందించిన చిత్రం ఆన్బావం పొల్లదదు అని చెప్పారు. ఇది పెళ్లయిన భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న సమస్యల నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. అలాంటి కథతో సాగే ఈ చిత్రం కోర్టు వరకు దారితీస్తుందని ఆ తర్వాత ఏం జరిగిందన్నది చిత్ర ముఖ్యాంశమని దర్శకుడు చెప్పారు. ఆద్యంతం వినోదభరితంగా సాగే ఇందులో ఓ ముఖ్యమైన విషయం గురించి చర్చించినట్లు చిత్ర కథానాయకుడు రియోరాజ్ తెలిపారు.


