విజయవంతంగా ఇన్నోవిజన్ హ్యాకథాన్
సాక్షి, చైన్నె: ఇండియన్ బ్యాంక్, ఐఐటీ మద్రాస్‌తో కలిసి ఫిన్‌టెక్ నేతృత్వంలో సైబర్ సెక్యూరిటీ అనే ఇతివృత్తంతో శనివారం ఇన్నోవిజన్ హ్యాకథాన్–2025, ఇన్నోవేట్ టు ఎలివేట్ విజేతలకు సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఒక పెద్ద చొరవలో భాగం నిర్వహించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐఐటీలు, విశ్వవిద్యాలయాలు తదితర ప్రముఖ సంస్థల సహకారంతో బ్యాంకింగ్ రంగానికి సైబర్ భద్రతలో ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఈ కార్యక్రమం జరిగింది. ఇండియన్ బ్యాంక్ సీఈఓ బినోద్ కుమార్ డేటా స్ట్రక్చర్లపై ఆసక్తితోపాటు కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌లో ప్రత్యేకతను వివరించారు. ఐఐటీ మద్రాసు డైరెక్టర్ కామకోటి, డీఎఫ్‌ఎస్ డైరెక్టర్ కీర్తి, ఆర్‌బీఐ సీజీఎం సువేందు పాటి, ఇండియన్ బ్యాంక్ ఈడీ మహేష్ కుమార్ బజాజ్, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీనియర్ అడ్వైజర్ శ్రీనివాస రావు, సీఏఎంఎస్ ఎండీ అనుజ్ కుమార్ , ఎన్‌పీసీఐ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బెంజమిన్ ఆంబ్రోస్‌లు పాల్గొన్నారు. ఇన్నోవిజన్ హ్యాకథాన్‌లో ఐఐటీ మద్రాస్ నుండి మొత్తం 33 జట్లు పాల్గొన్నాయి. ఇందులో 21 జట్లలో 12 జట్లను ఫిన్‌టెక్ విభాగంలో, 9 జట్లను సైబర్ సెక్యూరిటీ విభాగంలో ఎంపిక చేశారు. వీరి ఆలోచనల వాస్తవికత, ఔచిత్యం, సంభావ్య ప్రభావం ఆధారంగా. ఈ షార్ట్‌లిస్ట్ చేశారు. జట్లకు ఇండియన్ బ్యాంక్, ఐఐటీ మద్రాస్ రెండింటి నుండి నిపుణులైన మార్గదర్శకులు నియమించారు. వారు వారి ఆలోచనలను వాస్తవ ప్రపంచ బ్యాంకింగ్ సవాళ్లను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. మార్గనిర్దేశం చేశారు. మొదటి మూడు విజేతలకు బహుమతులు, మెమెంటోలను అందజేశారు.


