బంగారు తిరుచ్చిపై శ్రీకృష్ణుడు
చంద్రగిరి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో అనుబంధంగా వెలసిన శ్రీకృష్ణ స్వామివారు, అమ్మవార్లతో కలసి బుధవారం సాయంత్రం బంగారు తిరుచ్చిపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వామివారి జన్మనక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్యకై ంకర్యాలు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. తదుపరి సాయంత్రం శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆశీనులై నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు.


