అన్నానగర్: విరాలిమలై సమీపంలో అదృశ్యమైన మహిళ కాలిపోయిన మృతదేహమై కనిపించింది. ఆమె హత్యకు గురైందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. పు దుకోట్టై జిల్లా విరాలిమలై సమీపం కావరాపట్టికి చెందిన వెట్రివేల్‌కు భార్య మోనికా (24) ఉంది. వీ రికి పెళ్లయి నాలుగేళ్లు కావస్తున్నా పిల్లలు లేరు. దీంతో కుటుంబంలో తరచూ సమస్యలు తలెత్తేవని తె లుస్తుంది. ఈ స్థితిలో శనివారం ఇంట్లో ఉన్న మోని క హఠాత్తుగా అదృశ్యమైంది. దీంతో మోనిక తల్లి అంజమ్మాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి అదృశ్యమైన మోనిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ స్థితిలో సోమవారం ఉదయం, కవరపట్టి, దొప్పంకులంలో కాలిపోయిన స్థితిలో ఒక మహిళ మృతదేహం ఉన్నట్లు విరాలిమలై పోలీసులకు సమా చా రం అందింది. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కాలిపోయిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసు కుని విచారణ చేపట్టారు. ఆ మృతదేహం అదృశ్యమైన మోనిక అని నిర్ధారించారు. అనంతరం మోని క మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మోనికా ఆత్మహత్య చేసుకుందా? హత్యకు గురైందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.