వైభవం.. శ్రీవారి పుష్పయాగం | Sakshi
Sakshi News home page

వైభవం.. శ్రీవారి పుష్పయాగం

Published Mon, Nov 20 2023 12:40 AM

- - Sakshi

రెండున్నర టన్నుల పుష్పాల వినియోగం

కొరుక్కుపేట: చైన్నె టి.నగర్‌ వెంకటనారాయణ రోడ్డులోని తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి వార్షిక పుష్పయాగ మహోత్సవం ఆదివారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం హోమం, తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 నుంచి 5.00 వరకు శ్రీవారికి పుష్పయాగం చేపట్టారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణ, గోవింద నామస్మరణ మధ్య ఈ వేడుక సాగింది. పుష్పయాగంలో తులసి, చామంతి, కనకాంబరం, సంపంగి మంగళం పుష్పం, రోజా తదితర సుగంధ పరిమళాలు వెదజల్లే దాదాపు రెండున్నర టన్నుల పుష్పాలు వినియోగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్‌ ఏజే శేఖర్‌ దంపతులతో పాటు కమిటీ మాజీ సభ్యులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఢిల్లీకి గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి

రాజ్‌భవన్‌కు చేరిన 10 ముసాయిదాలు

హోంశాఖతో చర్చలు..?

సాక్షి, చైన్నె: అసెంబ్లీ వేదికగా పది ముసా యిదాలను మళ్లీ ఆమోదించి రాజ్‌ భవన్‌కు ప్రభుత్వం పంచిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం రాష్ట్రగవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఢిల్లీకి వెళ్లడం చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ వర్గాలతో ఆయన చర్చించాలని నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య వివాదం ముదిరిన విషయం తెలిసిందే. వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో పది ముసాయిదాలను గవర్నర్‌ వెనక్కి పంపించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వీటికి ఎలాంటి సవరణలు, మార్పులు చేర్పులు చేయకుండా అలాగే శనివారం ప్రత్యేక అసెంబ్లీని సమావేశ పరిచి పాలకులు ఆమోదించారు. ఈ పది ముసాయిదాలు రాజ్‌ భవన్‌కు మళ్లీ పంపించారు. వీటిపై గవర్నర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ జోరందుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం గవర్నర్‌ ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతకు దారి తీశాయి. ఆయనతో పాటు కార్యదర్శి, భద్రత అధికారులు, ఇతర సిబ్బంది సైతం ఢిల్లీకి వెళ్లడం గమనార్హం. ఈ పది ముసాయిదాల వ్యవహారంపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ వర్గాలతో సోమవారం గవర్నర్‌ చర్చించనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా జాతీయ భద్రత సలహాదారుడు అజిత్‌ దోవల్‌ చైన్నె రాజ్‌ భవన్‌లో శనివారం గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవితో భేటీ అయినట్లు సమాచారం. ఓ ర్యక్రమానికి వచ్చిన అనిత్‌ దోవల్‌ రాజ్‌ భవన్‌లో బస చేసినట్టు, ఈ దర్భంగా వీరి భేటీ జరిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. అజిత్‌ దోవల్‌, ఆర్‌ఎన్‌ రవి మాజీ ఐపీఎస్‌ అధికారులు కావడమే కాకుండా, జాతీయ భద్రత కమిటీలో ఇరువురు పనిచేశారు. దీంతో వారి మధ్య ఉన్న సాన్నిహిత్యం మేరకు సమావేశం జరిగినట్లు సమాచారం.

తిరుత్తణి: కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు
1/2

తిరుత్తణి: కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు

2/2

Advertisement
 
Advertisement