అన్నానగర్: వేదారణ్యం బీచ్‌లో క్లీన్ ఇండియా పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన సైకత శిల్పం ఆకట్టుకుంది. వివరాలు.. నాగపట్టణం వేదారణ్యం మునిసిపాలిటీ ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా ప్రాజెక్టు కింద బీచ్ క్లీనింగ్ పనులు చేపట్టారు. స్వచ్ఛతా కార్యక్రమాన్ని మునిసిపల్ చైర్మన్ పుగళేంది ప్రారంభించారు. విద్యార్థులకు సైకత శిల్పాలు, పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్ వెంకట లక్ష్మణన్ వీటిని ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, నగర పంచాయతీ సభ్యులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.


