వడ్డీ లేని రుణం పేరిట మోసం.. | - | Sakshi
Sakshi News home page

వడ్డీ లేని రుణం పేరిట మోసం..

Apr 10 2023 2:22 AM | Updated on Apr 10 2023 12:14 PM

- - Sakshi

తిరువొత్తియూరు: వడ్డీ లేకుండా రుణం ఇస్తామని నమ్మబలికి మోసం చేసిన నగల దుకాణ యజమానులను జనం ఆదివారం ముట్టడించారు. వివరాలు.. చైన్నె నొలంబూరు కేంద్రంగా రెండు నగల దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ నగలు తాకట్టు పెట్టిన వారికి వడ్డీ లేకుండా నగదు అప్పు ఇవ్వడం, నగల కోసం పెట్టుబడి పెట్టిన వారికి ఎక్కువ అధిక వడ్డీ ఇస్తామంటూ యజమానులు ఆసక్తికర ప్రకటనలు ఇచ్చారు.

దీన్ని నమ్మి ఆ ప్రాంతానికి చెందిన వారే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఈ రెండు దుకాణాలకు సంబంధించిన సంస్థల్లో నగదును పెట్టుబడిగా పెట్టారు. కానీ డబ్బు డిపాజిట్‌ చేసిన వారికి చెప్పిన ప్రకారం నగదు గానీ, వడ్డీ గానీ ఇవ్వలేదు. దీంతో మోసపోయిన ప్రజలు నొలంబూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈక్రమంలో డిపాజిట్‌దారులు 100 మందికి పైగా ఆదివారం ఉదయం నగల దుకాణాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని సముదాయించి పంపించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement