హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ పట్టణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక గడ్డిరెడ్డి ఫంక్షన్ హాల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఆదివారం జిల్లా స్థాయి ఈత పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ డీఈ వెంకటకిష్టయ్య, నిర్వాహకులు జనార్దన్, వీరస్వామి, సైదారావు శనివారం ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు పోటీల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
మత్తు పదార్థాల నియంత్రణకు పోలీసుల తనిఖీలు
కోదాడ రూరల్ : మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా నార్కోటిక్ డాగ్ (రోలెక్స్) సహాయంతో పోలీసులు శనివారం కోదాడ పట్టణంలో ముమ్మరంగా తనిఖీ నిర్వహించారు. రంగా థియేటర్ చౌరస్తా, బస్టాండ్ సెంటర్, ఖమ్మం క్రాస్‌రోడ్డు, పలు పాన్‌షాలు, కూరగాయాల మార్కెట్, టీ స్టాళ్లతోపాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో మత్తు పదార్థాల వాసనను పసిగట్టేలా డాగ్‌తో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ కె.శివశంకర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను అమ్మినా, కొనుగోలు చేసినా, సేవించే వారిపైనా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉద్యమకారులకు న్యాయం చేయాలి
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి సరైన న్యాయం చేయాలని టీజేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ కుంట్ల ధర్మార్జున్ కోరారు. శనివారం సూర్యాపేట పట్టణంలో రవి కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో డేవిడ్ కుమార్, గండూరి రమేష్, వెంకటేశ్వరరావు, అనంతుల మధు, నాగిరెడ్డి, మేకల నాగేశ్వరరావు, నాగిరెడ్డి, కేఎల్‌ఎన్.రావు, దుద్యాల రవీందర్‌రావు, ఎండి నజీర్, లక్ష్మీనారాయణ, నరసింహారావు, బ్రహ్మచారి, వనిత, అశోక్‌రెడ్డి, వెంకన్న, రమాశంకర్ పాల్గొన్నారు.


