యాదగిరీశుడి సన్నిధిలో 2.15గంటలు | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి సన్నిధిలో 2.15గంటలు

May 24 2026 1:57 AM | Updated on May 24 2026 1:57 AM

సీఎం పర్యటన సాగిందిలా..

యాదగిరిగుట్ట : టెంపుల్‌ సిటీపై వేద పాఠశాల నిర్మాణానికి, మరికొన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడానికి వచ్చిన సీఎం సుమారు 2 గంటల 15 నిమిషాల పాటు యాదగిరిగుట్టలో గడిపారు. సీఎం.. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌లు ఉదయం 8.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా గుట్టకు చేరుకున్నారు.

● 8.53 గంటలకు ప్రత్యేక కార్వన్‌ బస్సులోకి వెళ్లిన సీఎం సంప్రదాయ దుస్తులను ధరించి వచ్చారు.

● 9.26 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో అర్చకులు, పారాయణీకులు, వేద పండితులు, పూజారుల సమక్షంలో వేద పాఠశాల భూమి పూజకు శ్రీకారం చుట్టారు.

● 9.40 గంటలకు వేద పాఠశాలకు శంకుస్థాపన భూమి పూజను పూర్తి చేశారు.

● 9.42 గంటలకు వేద పాఠశాల నిర్మాణం చేసే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నిత్య కల్యాణ మండపం, గోశాల, దీక్షాపరుల సన్నిధానం, వేద పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన వాటితో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఆవిష్కరించారు.

● 10.03 గంటలకు యాదగిరీశుడి ఆలయంలోకి వెళ్లారు. త్రితల ద్వారం వద్ద ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.

● 10.10 గంటల నుంచి 10:21 గంటల వరకు గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి వచ్చారు.

● 10.22 గంటలకు ముఖ మండపంలో సీఎంతో పాటు మంత్రులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు, ఆలయ ఈఓ భవానీ శంకర్‌, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తిలు శ్రీస్వామి వారి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.

● 10.32 గంటలకు పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చారు.

● 10.55 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement